హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెతేలేత్తేశారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 202 పరుగులకే భారత్ ఆలౌటైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో శుభారంభం చేసింది. ఇక తొలి టెస్టులో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
"ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు. ఎవరో ఒకరైనా మూడెంకెల స్కోర్ సాధించి వుంటే బాగుండేది. తొలి ఇన్నింగ్స్‌లో 70 నుంచి 80 పరుగులు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడూ బ్యాటర్లకు ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. లక్ష్యం 230 పరుగులే అయినప్పటికి ఛేజ్ చేయడం అంత సులభం కాదు. ప్రస్తుత మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.
వారికి వైట్‌బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. కానీ రెడ్ బాల్ క్రికెట్‌లో పెద్దగా అనువభం లేదు. టెస్టు క్రికెట్‌లో ఎదగడానికి వారికి ఇంకాస్త సమయం అవసరం. ప్రతీ ఒక్క ఆటగాడికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. వారు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి సీనియర్ జట్టులోకి వచ్చారు. వారు తప్పకుండా భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నానని" విలేకరుల సమావేశంలో ద్రవిడ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment