PC: AFP
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించిన సంగతి తెలిసిందే. ద్రవిడ్‌తో పాటు మిగతా కోచింగ్ సిబ్బంది కాంట్రాక్టులను కూడా భారత క్రికెట్ బోర్డు పొడిగించింది. అయితే ద్రవిడ్ ఎంత కాలం కోచ్‌గా కొనసాగుతాడనే విషయాన్ని మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఇక తాజాగా ఇదే విషయంపై రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని ద్రవిడ్ తెలిపాడు.
"నేను ఇంకా బీసీసీఐతో ఒప్పందంపై సంతకం చేయలేదు. కానీ నా పదవీకాలంపై చర్చలు జరిపాను. నాకు కాంట్రాక్ట్ పేపర్లు వచ్చిన తర్వాత సంతకం చేస్తాను" అని ద్రవిడ్ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్ వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ వరకు భారత హెడ్ కోచ్ పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు భారత జట్టుతో ద్రవిడ్ కలవనున్నాడు. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. కాగా టూర్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: T20 World Cup 2024: జింబాబ్వేకు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా ఆర్హత
Comments
Please login to add a commentAdd a comment