రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌లకు అత్యున్నత అవార్డులు | Rohit Sharma, Rahul Dravid Win Top Honours At CEAT Awards | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌లకు అత్యున్నత అవార్డులు

Published Thu, Aug 22 2024 8:11 AM | Last Updated on Thu, Aug 22 2024 9:05 AM

Rohit Sharma, Rahul Dravid Win Top Honours At CEAT Awards

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌లకు క్రికెట్‌కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి. సియెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ 2023-24లో రోహిత్‌కు మెన్స్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు.. రాహుల్‌ ద్రవిడ్‌కు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డులు లభించాయి. నిన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో వీరిద్దరు ఈ అవార్డులు అందుకున్నారు. 

రాహుల్‌, రోహిత్‌తో పాటు మరికొందరు సియెట్‌ రేటింగ్‌ అవార్డులు అందుకున్నారు. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. మెన్స్‌ వన్డే బ్యాటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, యశస్వి జైస్వాల్‌ మెన్స్‌ టెస్ట్‌ బ్యాటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, ఇంగ్లండ్‌ ఆటగాడు ఫిల్‌ సాల్ట్‌ మెన్స్‌ టీ20 బ్యాటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నారు.

బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్‌ షమీ మెన్స్‌ వన్డే బౌలర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, రవిచంద్రన్‌ అశ్విన్‌ మెన్స్‌ టెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ మెన్స్‌ టీ20 బౌలర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు అందుకున్నారు.

ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ ప్రత్యేక మెమెంటోను అందుకుగా.. దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి తమిళనాడు కెప్టెన్‌ ఆర్‌ సాయి కిషోర్‌కు డొమెస్టిక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు.

మహిళల క్రికెట్‌లో టీమిండియాను అత్యధిక టీ20ల్లో ముందుండి నడిపించినందుకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన వుమెన్స్‌ ఇండియన్‌ బ్యాటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకోగా.. దీప్తి శర్మ వుమెన్స్‌ ఇండియన్‌ బౌలర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకుంది. ఇటీవల టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు నమోదు చేసిన షెఫాలీ వర్మను ప్రత్యేక మెమెంటోతో సత్కరించారు.

క్రికెట్‌ ఉన్నతికి అనునిత్యం పరితపించే బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్సెలెన్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అవార్డు అందుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement