ceat
-
సియట్, నెట్వర్క్18 లాభాలు డౌన్
టైర్ల తయారీ దిగ్గజం సియట్(Ceat) లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 46 శాతంపైగా క్షీణించి రూ. 97 కోట్లకు పరిమితమైంది. పెరిగిన ముడిసరుకుల వ్యయాలు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 181 కోట్లుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,963 కోట్ల నుంచి రూ. 3,300 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,739 కోట్ల నుంచి రూ. 3,176 కోట్లకు పెరిగాయి. ముడిసరుకుల వినియోగ వ్యయాలు రూ. 1,695 కోట్ల నుంచి రూ. 2,117 కోట్లకు ఎగశాయి. అన్ని విభాగాలలోనూ పటిష్ట ఆర్డర్ బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అర్నాబ్ బెనర్జీ పేర్కొన్నారు. స్థిరమైన డిమాండ్ కారణంగా ఆదాయంలో వృద్ధి కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు.ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలునెట్వర్క్18..ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18(Network18) మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో భారీ నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,400 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే అనుకోని పద్దులకు ముందు దాదాపు రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. అనుబంధ సంస్థల గుర్తింపురద్దుతో రూ. 1,426 కోట్ల నష్టం నమోదైనట్లు వెల్లడించింది. వీటిని ప్రొవిజనల్‌గా మదింపు చేసినట్లు తెలియజేసింది. స్టార్ ఇండియాతో అనుబంధ కంపెనీ వయాకామ్18 విలీనం కారణంగా గతేడాది(2023–24) ఫలితాలను పోల్చతగదని పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 1,361 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 476 కోట్లను అధిగమించగా.. అనుకోని ఆర్జనతో రూ.3,432 కోట్ల లాభం ఆర్జించింది. -
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం.. సందడి చేసిన క్రికెట్ స్టార్స్ (ఫొటోలు)
-
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లకు అత్యున్నత అవార్డులు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు క్రికెట్‌కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి. సియెట్ రేటింగ్ అవార్డ్స్ 2023-24లో రోహిత్‌కు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు.. రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డులు లభించాయి. నిన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో వీరిద్దరు ఈ అవార్డులు అందుకున్నారు. Rohit Sharma receiving the CEAT Cricketer of the year award from Jay Shah. 💥 pic.twitter.com/5FdU2CIWi6— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024రాహుల్, రోహిత్‌తో పాటు మరికొందరు సియెట్ రేటింగ్ అవార్డులు అందుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.CEAT Best ODI batter of the year - Virat Kohli. 🐐 pic.twitter.com/efYQ9GP5gc— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు.Jay Shah, Rohit, Dravid, Gavaskar, Shami, Shreyas, Hayden, Salt Deepti, Harmanpreet at the CEAT awards. 👌❤️ pic.twitter.com/tJ2mmlYeKb— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ప్రత్యేక మెమెంటోను అందుకుగా.. దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి తమిళనాడు కెప్టెన్ ఆర్ సాయి కిషోర్‌కు డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.Unyielding at the crease, a champion beyond compare. Congratulations @ybj_19 on being CEAT Test Batter of the Year!#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG pic.twitter.com/x0jcLPPROS— CEAT TYRES (@CEATtyres) August 21, 2024మహిళల క్రికెట్లో టీమిండియాను అత్యధిక టీ20ల్లో ముందుండి నడిపించినందుకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన వుమెన్స్ ఇండియన్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోగా.. దీప్తి శర్మ వుమెన్స్ ఇండియన్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకుంది. ఇటీవల టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేసిన షెఫాలీ వర్మను ప్రత్యేక మెమెంటోతో సత్కరించారు.A hearty Congratulations to @JayShah , for bringing unparelleled leadership and direction to the most loved sport of our country!#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG pic.twitter.com/BWGGyUqoQ1— CEAT TYRES (@CEATtyres) August 21, 2024క్రికెట్ ఉన్నతికి అనునిత్యం పరితపించే బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్సెలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నాడు. Celebrating the pinnacle of T20 leadership! Join us in honouring the standout leader of the league.#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG @ShreyasIyer15 pic.twitter.com/j0vqvx1ZAI— CEAT TYRES (@CEATtyres) August 21, 2024 -
స్కై, కేన్లకు టీ20, టెస్ట్ ప్లేయర్ అవార్డులు.. శుభ్‌మన్‌కు డబుల్ ధమాకా
2023 CEAT క్రికెట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న (ఆగస్ట్ 21) దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్‌తో పాటు ఇతర రంగాలకు చెందిన చాలామంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో (మూడు ఫార్మాట్లలో) అత్యుత్తమ ప్రదర్శన (రేటింగ్స్ ఆధారంగా) కనబర్చిన ఆటగాళ్లను CEAT జ్యూరీ అవార్డులకు ఎంపిక చేసింది. టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్‌గా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కాగా.. టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ దక్కించుకున్నాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గిల్‌కు ఈ రెండు అవార్డులను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందజేశాడు. ఈ ఏడాది వన్డేల్లో భీకర ఫామ్‌లో ఉన్న గిల్.. ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 750 పరుగులు చేయగా.. స్కై.. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 10 టీ20ల్లో 433 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గతేడాది సైతం ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా స్కై 2022లో టాప్ టీ20 రన్స్ స్కోరర్‌గా (187.43 స్ట్రయిక్‌రేట్‌తో 46.56 సగటున 1164 పరుగులు) నిలిచాడు. ఇందులో 68 సిక్సర్లు ఉన్నాయి. CEAT అవార్డులు గెలుచుకున్న ఇతరుల వివరాలు.. టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్: భువనేశ్వర్ కుమార్ ఇన్నోవేటెడ్ కోచ్ ఆఫ్ ద ఇయర్: బ్రెండన్ మెక్కల్లమ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: దీప్తి శర్మ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా దీప్తి శర్మ అవార్డును అందుకుంది. -
టైర్ల దిగ్గజం సియట్ ఆసక్తికర ఫలితాలు, లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో టైర్ల తయారీ దిగ్గజం సియట్ లిమిటెడ్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 81 శాతం క్షీణించి కేవలం రూ.7.83 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,452 కోట్ల నుంచి రూ. 2,894 కోట్లకు ఎగసింది. ఇన్పుట్ ఖర్చులు తమ లాభాలను ప్రభావితం చేశాయని కంపెనీ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,402 కోట్ల నుంచి రూ. 2,864 కోట్లకు పెరిగాయి. రానున్న రెండేళ్లలో అంబర్నాథ్ ప్లాంటులో రేడియల్ టైర్ల తయారీ సామర్థ్యాన్ని రోజుకి 55 టన్నులకు పెంచేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అదనంగా రూ. 396 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్టుబడులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. -
వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్‌బ్లోయింగ్!
వీధి చివర కిరాణా దుకాణంలో వాహన టైర్లు అందుబాటులో ఉంటే..? వినడానికే కొత్తగా ఉంది కదూ..! ఆర్పీజీ గ్రూపు కంపెనీ సియట్ ఇదే ఆలోచనను అమలు చేస్తోంది. కస్టమర్లకు చేరువ అయ్యేందుకు కిరాణా దుకాణాలను సైతం వినియోగించుకోవాలన్నది ఈ సంస్థ ప్రణాళికగా ఉంది. పాలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు కొనుగోలు చేసే షాపులో టైర్లు అమ్మడమే ఇప్పుడు కొత్త ట్రెండ్. నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల మాదిరిగా కాకుండా.. టైర్ల పరిశ్రమ పరిమిత వృద్ధితో కూడినది. ఈ పరిమిత మార్కెట్లోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేయాలన్నది సియట్ అభిమతంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు అసలు టైర్లను విక్రయించని దుకాణాలతో ఓ నెట్‌వర్క్‌ను సియట్ ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల వద్ద కూడా కస్టమర్ల కోసం టైర్లను అందుబాటులో ఉంచుతుంది. దీంతో దాదాపు దేశ ప్రజల్లో అధిక శాతాన్ని చేరుకోవచ్చన్నది కంపెనీ యోచన. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం వెళ్లే వీధి దుకాణం వద్ద.. ‘సియట్’ టైర్లు కస్టమర్ల కళ్లలో పడుతుంటాయి. దీంతో బ్రాండ్‌కు ఉచిత ప్రచారం కూడా లభించినట్టు అవుతుంది. నూతన నమూనా.. ‘‘కిరాణా స్టోర్లు, పంక్చర్ రిపేర్ దుకాణాలు, ఓఈఎం మినీ అధీకృత సేవా కేంద్రాలు, వాహన విడిభాగాలు విక్రయించే స్టోర్ల యజమానులను సంప్రదించి, సియట్ టైర్లను విక్రయించాలని కోరాం’’అని సియట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్ణబ్ బెనర్జీ తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉంది. 2021–22లో 1.34 కోట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. ఇందులో సగానికి పైన గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉండడం గమనార్హం. ఒక విధంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల మార్కెటింగ్ నమూనాను సియట్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. సియట్ కంపెనీ విక్రయించే ద్విచక్ర వాహన టైర్లలో 70 శాతం సంప్రదాయేతర స్టోర్ల నుంచే ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా ద్విచక్ర వాహన టైర్ల మార్కెట్లో సియట్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2011 నాటికి 11 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 30 శాతానికి పెంచుకుని మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. మార్కెట్ అగ్రగామిగా ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ను సైతం టూవీలర్ విభాగంలో వెనక్కి నెట్టేసింది. కొన్నేళ్ల క్రితం 20,000 విక్రయ కేంద్రాలు ఉంటే, వాటిని 50,000కు పెంచుకున్నట్టు ఆర్ణబ్ బెనర్జీ వెల్లడించారు. కస్టమర్లకు మరింత చేరువ అయ్యే చర్యలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఇతర టైర్ల కంపెనీలతో పోలిస్తే డీలర్లు, సబ్ డీలర్లకు సియట్ విక్రయించే ధర అధికంగానే ఉన్నప్పటికీ.. తన వాటాను మాత్రం పెంచుకోగలుగుతోంది. చదవండి: Elon Musk: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
ఆమిర్ ఖాన్ యాడ్‌పై తీవ్ర దుమారం
Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈమధ్య రిలీజ్ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. Hello @CEATtyres The chairman of your parent company has such views on Hinduism and it's traditions We have many alternative tyre companies in India MRF, JK, Apollo So there won't be any problem for us if we #BoycottCEAT We need an unconditional apology from him ✌🏼 pic.twitter.com/Qr7UjGYDjC — Anish (@Aniiiiish) April 14, 2021 చదవండి: అండర్వేర్ యాడ్.. ఏం మెసేజ్ ఇద్దామని రష్మిక? -
స్టాక్స్ వ్యూ
సియట్ బ్రోకరేజ్ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,390 టార్గెట్ ధర: రూ.1,899 ఎందుకంటే: ఆర్పీ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో అతి పెద్ద టైర్ల కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ అన్ని రకాల టైర్లను–ట్రక్, బస్సు, టూ, త్రీ వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, తేలిక రకం వాణిజ్య వాహనాలు, వ్యవసాయ, స్పెషాల్టీ టైర్లను తయారు చేస్తోంది. అమ్మకాల్లో రీప్లేస్మెంట్ మార్కెట్ వాటా 61%, ఎగుమతులు 12 %గా ఉన్నాయి. 4,500 మంది డీలర్లతో పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 15% వృద్ధితో రూ.1,670 కోట్లకు పెరిగింది. టైర్ల అమ్మకాలు 18% పెరిగాయి. టూ వీలర్ల సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్ల టైర్ల ధరలను పెంచడం కంపెనీకి కలసివచ్చింది. స్థూల మార్జిన్ 5% ఎగసి 38.6%కి చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, స్వల్పంగా (25 బేసిస్ పాయింట్లు) తగ్గింది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ముడి పదార్థాల ధరలు 2 శాతం పెరిగినప్పటికీ, ఇబిటా 223 శాతం పెరిగి రూ.170 కోట్లకు చేరింది. నికర లాభం 307 శాతం వృద్ధితో రూ.78 కోట్లకు చేరింది. వచ్చే క్వార్టర్లో ముడి పదార్థాల ధరలు మరో 2–3 శాతం మేర పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి రూ.870 కోట్లుగా ఉన్న రుణభారం(కన్సాలిడేటెడ్) ఈ ఏడాది జూన్ నాటికి రూ.750 కోట్లకు తగ్గింది. ముడి పదార్థాల ధరలు పెరుగుతుండటంతో టైర్ల ధరలను ఈ కంపెనీ 1–2 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ముడి చమురు, రబ్బరు ధరలు మరింతగా పెరిగితే మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏబీబీ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ అమ్మొచ్చు ప్రస్తుత ధర: రూ.1,184 టార్గెట్ ధర: రూ. 990 ఎందుకంటే: విద్యుత్ ప్రసార, పంపిణీ, ప్రాసెస్ ఆటోమేషన్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇబిటా మార్జిన్ 7.8% ఉండొచ్చని అంచనా వేయగా 7.2% మాత్రమే సాధించగలిగింది. ఇబిటా 33% వృద్ధితో రూ.196 కోట్లకు చేరింది. అయితే రూ.210 కోట్ల ఇబిటా సాధిస్తుందని అంచనాలున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల ఇబిటా అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభం రూ. 100 కోట్లకు చేరింది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,710 కోట్లకు పెరిగింది. కంపెనీ ఫలితాల్లో ఇదొక్కటే అంచనాలను అందుకోగలిగింది. స్థూల మార్జిన్ 2.7% తగ్గి 33.5%కి చేరింది. ఈ కంపెనీ నికర దిగుమతిదారు కాబట్టి రూపాయి పతనం ప్రతికూల ప్రభావం(ఈ క్యూ2లో రూ.10 కోట్ల ఫారెక్స్ నష్టాలు వచ్చాయి) చూపించడం, ముడి పదార్థాల ధరలు పెరగడం.. ఈ మూడు కారణాల వల్ల స్థూల మార్జిన్ తగ్గింది. సోలార్, రైల్, డిజిటలైజేషన్ వంటి కొత్త రంగాలపై దృష్టి కారణంగా ఆర్డర్లు 7% పెరిగి రూ.2,500 కోట్లకు చేరాయి. అయితే ఈ కంపెనీ ఈ క్యూ2లో భారీ ఆర్డర్లను ఏమీ సంపాదించలేకపోయింది. మార్జిన్లు తక్కువగా ఉండే ప్రాజెక్ట్ వ్యాపారం అమ్మకాలు అధికంగా ఉండటం, రూపాయి పతనం ప్రతికూల ప్రభావం కారణంగా కంపెనీ ఆదాయ అంచనాలను ప్రస్తుత ఏడాదికి 8%, వచ్చే సంవత్సరానికి 2% చొప్పున తగ్గించాం. విద్యుత్ ప్రసార, పంపిణీ రంగాలకు అవసరమయ్యే ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. సర్వీస్ పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సాకారం కావడానికి దీర్ఘకాలం పడుతుంది. ఈ షేర్ విలువ అధికంగా ఉందనే ఉద్దేశంతో అమ్మేయండి అనే రేటింగ్‌ను ఇస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
గబ్బర్-గేల్ ఒక్కటై ఇరగదీశారు! వైరల్
సాక్షి స్పోర్ట్స్: అద్భుతమైన ఆటతోపాటు విలక్షణమైన యాటిట్యూడ్‌తోనూ అభిమానుల్ని అలరించడంలో ముందుంటారు జమైకన్ క్రిస్‌గేల్, ఇండియన్ ‘గబ్బర్’ శిఖర్ ధావన్! మొన్నటి ఐపీఎల్లో వేర్వేరు జట్ల తరఫున ఆడిన ఈ దిగ్గజాలు.. వేదిక మారగానే ఒక్కటైపోయారు. ఇటీవల ముంబైలో జరిగిన సియాట్ అవార్డుల ఫంక్షన్లో ‘జుమ్మా..చుమ్మా..’ పాటకు స్టెప్పులేసి ఇరగదీశారు. గబ్బర్-గేల్ల సందడి వీడియో వైరల్ అయింది. జమైకన్ దలేర్ మెహంది: పంజాబీ స్టైల్లో తలపాగా ధరించిన క్రిస్ గేల్‌ను ధావన్ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘‘చూడండి.. జమైకా దలేర్ మెహందితో సెల్ఫీదిగా. మనసంతా బోలో తారారారా..’’అని గబ్బర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2018లో కింగ్స్ లెవెన్ పంజాబ్ తరుఫున 11 మ్యాచ్‌లు ఆడిన గేల్.. ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీలతో మొత్తం 368 పరుగులు చేశాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన శిఖర్ ధావన్ నాలుగు హాఫ్ సెంచరీలతో మొత్తం 497 పరుగులు చేశాడు. -
హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ‘సియట్’ ఒప్పందం
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ప్రఖ్యాత టైర్ల ఉత్పత్తుల సంస్థ ‘సియట్’ జత కట్టింది. ఈ సంస్థకు అంబాసిడర్‌గా ఎంపికైన హర్మన్... ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శిస్తుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలతో ప్రస్తుతం ఒప్పందం కొనసాగిస్తున్న సియట్ ఒక మహిళా క్రికెటర్ బ్యాట్‌కు ఎండార్స్ చేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది హర్మన్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. -
ప్యాసింజర్ వాహనాలపై ఫోకస్
• సియట్ వైస్ ప్రెసిడెంట్ నితీష్ బజాజ్ వెల్లడి • తెలుగు రాష్ట్రాల్లోకి పంక్చర్ సేఫ్ టైర్లు విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్ల తయారీ సంస్థ సియట్ ప్రధానంగా కార్లు, మోటార్‌సైకిల్ తదితర ప్యాసింజర్ వాహనాల టైర్లపై దృష్టి సారిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా కొంగ్రొత్త ఉత్పత్తులు ప్రవేశపెడుతోంది. ‘ప్రస్తుతం మేం ఎక్కువగా ప్యాసింజర్ సెగ్మెంట్‌పై (టూ, ఫోర్ వీలర్లు) ఆ తర్వాత ట్రక్స్ విభాగంపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగా ఈ సెగ్మెంట్ విక్రయాలు పెంచుకుంటున్నాం. అయిదేళ్ల క్రితం మా ట్రక్ విభాగం విక్రయాలు దాదాపు 60 శాతం ఉండేవి. ప్రస్తుతం ట్రక్ సెగ్మెంట్ వాటా 40-45 శాతం మేర ఉంటుండగా.. మిగతాది ట్రక్యేతర విభాగం వాటా ఉంటోంది’ అని సియట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) నితీశ్ బజాజ్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఈ వ్యూహంలో భాగంగానే తాజాగా ద్విచక్ర వాహనాల కోసం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి పంక్చర్ సేఫ్ టైర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటి ధర సాధారణ టైర్లతో పోలిస్తే కొంత అధికంగా దాదాపు రూ. 1800-1,900 శ్రేణిలో ఉండగలదని బజాజ్ తెలిపారు. సుమారు నాలుగు మి.మీ. మందం గల మేకులు గుచ్చుకున్నా పంక్చర్ కాకుండా దృఢంగా ఉండేట్లు రీజెన్ టెక్నాలజీతో ఈ ట్యూబ్‌లెస్ టైర్లను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో వీటిని ప్రవేశపెడుతున్నామని, మరో ఆరునెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని తెలిపారాయన. మెరుగైన వర్షపాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా డిమాండ్, ఎకానమీ రికవరీ తదితర అంశాల కారణంగా ద్వితీయార్ధంలో వాహన అమ్మకాలు పుంజుకుని, టైర్ల విక్రయాలు మరింత మెరుగ్గా ఉండగలవని ఆశిస్తున్నట్లు బజాజ్ వివరించారు. ప్రస్తుతం 8 శాతం మేర వృద్ధి సాధిస్తున్న పరిశ్రమ రెండంకెల స్థాయిని నమోదు చేయగలదని అంచనాలున్నట్లు చెప్పారు. విలువపరంగా టైర్ల మార్కెట్లో తమకు 10-12 శాతం వాటా ఉందని తెలిపారు. అమ్మకాలు దాదాపు రూ. 6,500 కోట్ల మేర ఉండగా.. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా సుమారు పది శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా సొంత ప్లాంట్లు నాలుగు, శ్రీలంకలో ఒకటి ఉన్నాయని, కొత్తగా మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో మరో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని బజాజ్ తెలిపారు. ఇది వచ్చే ఆరు-తొమ్మిది నెలల్లో అందుబాటులోకి రాగలదని, అటు బంగ్లాదేశ్‌లోనూ ప్లాంటు ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.