
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ప్రఖ్యాత టైర్ల ఉత్పత్తుల సంస్థ ‘సియట్’ జత కట్టింది. ఈ సంస్థకు అంబాసిడర్‌గా ఎంపికైన హర్మన్... ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శిస్తుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలతో ప్రస్తుతం ఒప్పందం కొనసాగిస్తున్న సియట్ ఒక మహిళా క్రికెటర్ బ్యాట్‌కు ఎండార్స్ చేయడం ఇదే మొదటిసారి.
గత ఏడాది హర్మన్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.