వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు పడగొట్టి తన మార్క్‌ను చూపించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 10 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఆడించాడన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు బుమ్రాకి విశ్రాంతి ఇచ్చి ఉంటే బాగుండేది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ.. గత రెండు మ్యాచ్‌ల నుంచి భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ఒకట్రెండు రోజుల్లో న్యూజిలాండ్ వంటి పెద్ద జట్టుతో టీమిండియా ఆడనుంది. కాబట్టి బంగ్లాతో మ్యాచ్‌కు బుమ్రాకి విశ్రాంతి ఇచ్చి ఉండాల్సింది. అయితే భారత జట్టుకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మూడు రోజుల విశ్రాంతి లభించింది.
బహుశా అది సరిపోతుందని జట్టు మేనెజ్‌మెంట్ భావించి వుండవచ్చు. కానీ బుమ్రా గాయం నుంచి కోలుకుని వచ్చాడు కాబట్టి మరింత విశ్రాంతి అవసరమని" పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో మ్యాచ్‌కు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ODI WC 2023 IND Vs BAN: కొంచెం కూడా ఓపిక లేదు.. అలా వికెట్లు పారేసుకుంటే ఎలా?: యువ బ్యాటర్లపై భారత దిగ్గజం ఫైర్
Comments
Please login to add a commentAdd a comment