
టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఫిబ్రవరి 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే మరణించిన నాలుగు రోజుల తర్వాత భారత జట్టు ఆటగాళ్లు సంతాపం తెలిపారు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా అతనికి నివాళిగా.. భారత జట్టు ఆటగాళ్లు చేతికి బ్లాక్ బ్యాండ్స్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు.
ఈ క్రమంలో ఆలస్యంగా స్పందించినందుకు భారత జట్టు మేనెజ్‌మెంట్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అయనొక భారత జట్టుమాజీ కెప్టెన్ అని, జట్టు మేనెజ్‌మెంట్ మొదటి రోజు ఆటలోనే వాళులర్పించింటే బాగుండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
" గైక్వాడ్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆయన ఉన్న లేకపోయినా గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. ఆయన మృతి పట్ల మొదటి రోజు ఆటలోనే సంతాపం వ్యక్తం చేయాల్సింది.
ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముందుగా ఎందుకు తీసుకోలేదో నాకు అర్ధం కావడం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత ఆలస్యం జరగలేదని రాజ్‌కోట్ టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న లిటిల్ మాస్టర్" పేర్కొన్నాడు.