టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అరంగేట్రంలోనే శతకంతో అలరించిన ఈ ముంబై బ్యాటర్.. పట్టుమని పది టెస్టుల్లోనే వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
అరంగేట్రంలోనే 171 పరుగులు
గతేడాది వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి టెస్టులోనే 171 పరుగులతో చెలరేగాడు. ఆ తర్వాత యశస్వి అద్బుత ఇన్నింగ్స్‌తో అలరిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
విలువైన అర్ధ శతకం
ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఖాతాలో ఇప్పటి వరకు టెస్టుల్లో మూడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ జైస్వాల్ తన హవా కొనసాగిస్తున్నాడు. చెన్నై వేదికగా గురువారం మొదలైన మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(6), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(6) విఫలమైన వేళ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో విలువైన అర్ధ శతకం(56) బాదాడు.
గావస్కర్ రికార్డు బ్రేక్
ఇక రెండో ఇన్నింగ్స్‌లో పది పరుగులకే పరిమితమైనా.. జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌లోని తొలి పది టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. తద్వారా సునిల్ గావస్కర్(978) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.
తమ కెరీర్‌లో మొదటి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు
1.డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)- 1446 పరుగులు
2.ఎవర్టన్ వీక్స్(వెస్టిండీస్)- 1125 పరుగులు
3.జార్జ్ హెడ్లీ(వెస్టిండీస్)- 1102 పరుగులు
4. యశస్వి జైస్వాల్(ఇండియా)- 1094 పరుగులు
5. మార్క్ టేలర్(ఆస్ట్రేలియా)- 1088 పరుగులు.
చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
పంత్‌పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!
Comments
Please login to add a commentAdd a comment