Asia Cup 2023: భారత్‌, పాకిస్తానే కాదు.. ఆ జట్టు కూడా చాలా డేంజరస్‌! | Sunil Gavaskar Urges To Focus On Srilanka Apart From India-Pakistan Rivalry - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: భారత్‌, పాకిస్తానే కాదు.. ఆ జట్టు కూడా చాలా డేంజరస్‌!

Published Thu, Aug 31 2023 10:43 AM | Last Updated on Thu, Aug 31 2023 10:54 AM

Sunil Gavaskar Urges To Focus On Srilanka Apart From India Pakistan Rivalry - Sakshi

ఆసియాకప్‌-2023 బుధవారం(ఆగస్టు 30)తో ప్రారంభమైంది. ముల్తాన్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్తాన్‌ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో పాక్‌ ఘన విజయం సాధించింది. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

ఇక ఈ టోర్నీలో క్రికెట్‌ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. సెప్టెంబర్‌ 2న కాండీ వేదికగా చిరకాల ప్రత్యర్థిలు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

"ఆసియాకప్‌లో అందరూ భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పోటీ గురించే మాట్లాడతున్నారు. ​కానీ ఈ టోర్నీలో శ్రీలంక కూడా ఆడుతుందన్న విషయం మర్చిపోకుడదు. గత ఏడాది ఆసియాకప్‌ను లంకనే సొంతం చేసుకుంది. ​కాబట్టి ఈ మూడు దేశాల మధ్య పోటీ ఎప్పుడూ ప్రత్యేకమే" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్‌ పేర్కొన్నాడు.

ఇక శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే ఈ టోర్నీకి వనిందు హసరంగా, చమీరా, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్‌ ఆటగాళ్లు దూరమయ్యారు.
చదవండిబాబర్‌ చాలా సింపుల్‌గా ఉంటాడు.. కానీ బ్యాటింగ్‌ మాత్రం అద్భుతం: భారత మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement