టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసిన విరాట్.. అఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఆఖరి బంతికి భారత్ విజయం సాధించగానే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌తో.. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబారాన్ని అంటాయి. ఈ క్రమంలో స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విన్నింగ్స్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయాడు. ఆట ఆఖరి ఓవర్ సమయంలో గవాస్కర్ బౌండరీ లైన్ వద్ద నిలుచుని మ్యాచ్‌ను వీక్షించాడు.
చివరి బంతికి అశ్విన్ విన్నింగ్ రన్ కొట్టగానే.. గవాస్కర్ డ్యాన్స్ చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కాగా గవాస్కర్ పక్కన భారత మాజీ ఆటగాళ్లుఇర్ఫాన్ ఫఠాన్, కృష్ణమచారి శ్రీకాంత్ ఉన్నారు. ఇక టీ20 ప్రపంచకప్-2022లో గవాస్కర్ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
The celebration by Sunil Gavaskar is gold. pic.twitter.com/5RkFtEJ1nx
— Johns. (@CricCrazyJohns) October 23, 2022
చదవండి: T20 World Cup 2022: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment