దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాకుండా గతేడాది మొత్తం టెస్టుల్లో గిల్ ప్రదర్శన అంతంతమాత్రమే. గిల్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 48 మ్యాచ్‌లు ఆడి 46.82 సగటున 7 సెంచరీలు, 10 అర్థసెంచరీల సాయంతో 2154 పరుగులు చేశాడు.
అయితే ఏడాది టెస్టుల్లో మాత్రం గిల్ 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒకే సెంచరీ మాత్రమే ఉంది. మిగితా మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో కొత్త ఏడాదిలోనైనా తన టెస్టు గణాంకాలను మెరుగు పరుచుకోవాలని గిల్ భావిస్తున్నాడు.
జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా ప్రోటీస్‌తో జరగనున్న రెండో టెస్టు కోసం ప్రిన్స్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గిల్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"టెస్టు క్రికెట్‌లో శుబ్‌మన్ గిల్ కొంచెం దూకుడుగా ఆడుతున్నాడు. వైట్‌బాల్ క్రికెట్ టెస్టులకు చాలా తేడా ఉంటుంది. వన్డేలు, టీ20లు ఆడే విధంగా టెస్టు క్రికెట్ ఆడుతామంటే ఇబ్బంది పడక తప్పదు. టెస్టుల్లో వాడే రెడ్ బాల్‌లో కూడా కొంచెం తేడా ఉంటుంది. వైట్ బాల్ కంటే రెడ్ బాల్ బాగా స్వింగ్ అవుతోంది. అంతేకాకుండా బౌన్స్ కూడా ఎక్కువగా అవుతోంది.
గిల్ అది మైండ్‌లో పెట్టుకుని ఆడాలి. శుబ్‌మన్ గిల్ తన టెస్టు కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. అతడు తన బ్యాటింగ్ స్టైల్‌తో అందరిని అకట్టుకుకున్నాడు. అతడు మళ్లీ తిరిగి తన ఫామ్‌ను పొందుతాడని ఆశిస్తున్నానని" స్టార్‌స్పోర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: Ind vs SA 2nd Test: మార్పులు సూచించిన ఇర్ఫాన్ పఠాన్.. ప్రసిద్ కృష్ణ ఉంటే..
Comments
Please login to add a commentAdd a comment