సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రోహిత్ తనంతటతానే దూరంగా ఉండాలని నిర్ణయించకున్నాడని టాస్ సమయంలో స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు.
రోహిత్ స్దానంలో తుది జట్టులోకి శుబ్‌మన్ గిల్(Shubman gill) వచ్చాడు. రోహిత్ గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపరిచిన హిట్‌మ్యాన్.. ఆస్ట్రేలియా గడ్డపై అదే తీరును కనబరుస్తున్నాడు.
ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ వైదగొలగాలని నిర్ణయించుకున్నాడు. వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు
"పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ స్వచ్చందంగా తానుకు తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.
ఇది పూర్తిగా అతని సొంత నిర్ణయమే అనిపిస్తుంది. ఒక కెప్టెన్‌గా రోహిత్ తీసుకున్న నిజంగా ప్రశంసనీయం. రోహిత్ భవిష్యత్తు కెప్టెన్లకు రోల్‌మోడల్‌గా నిలుస్తాడు" అని గవాస్కర్ పేర్కొన్నారు.
చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!
Comments
Please login to add a commentAdd a comment