సునీల్‌ గవాస్కర్‌ను కలిసిన బాబర్‌ ఆజం.. వీడియో వైరల్‌ | Sunil Gavaskar Meets Babar Azam At Dining Area | Sakshi
Sakshi News home page

T20 WC: సునీల్‌ గవాస్కర్‌ను కలిసిన బాబర్‌ ఆజం.. వీడియో వైరల్‌

Published Sun, Jun 2 2024 7:00 PM | Last Updated on Mon, Jun 3 2024 10:30 AM

Sunil Gavaskar Meets Babar Azam At Dining Area

టీ20 వరల్డ్‌కప్‌-2024కు పాకిస్తాన్‌ సన్నద్దమవుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్‌ ఓటమి చవిచూసిన పాక్‌.. తమ లోపాలను సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే న్యూయార్క్‌ చేరుకున్న పాకిస్తాన్‌ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా ఉంది.

ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో డల్లాస్‌ వేదికగా అమెరికాతో తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. న్యూయర్క్‌లోని ఓ హోటల్‌లో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ కలిశాడు.

హోటల్‌లోని డైనింగ్ ఏరియాలో అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీసీసీ ఎక్స్‌లో షేర్‌ చేసింది. కాగా ఈ మెగా టోర్నీకి సంబంధించి కామెంటరీ ప్యానల్‌లో గవాస్కర్‌ సభ్యునిగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఇక టీ20 వరల్డ్‌కప్‌-2024 సందడి షురూ అయింది. ఆదివారం(జూన్‌ 2) అమెరికా-కెనడా మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. తొలి మ్యాచ్‌లో కెనడాపై 7 వికెట్ల తేడాతో యూఎస్‌ఎ ఘన విజయం సాధించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement