హార్దిక్ పాండ్యా (PC: BCCI/IPL)
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి ఓటమి చవిచూశాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ కెప్టెన్సీ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. బ్యాటింగ్ బౌలింగ్‌లో తన మార్క్‌ను హార్దిక్ చూపించలేకపోయాడు. కెప్టెన్సీలో సరైన వ్యూహాలను రచించడంలో పాండ్యా విఫలయ్యాడు. దీంతో హార్దిక్ వల్లే ముంబై ఓడిపోయిందని నెటజన్లు తెగ ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సపోర్ట్‌గా నిలిచాడు. ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమేనని, ఆటలో గెలుపోటములు సహజం అంటూ గవాస్కర్ ఓదర్చాడు.
"హార్దిక్ పాండ్యా నీవు బాధపడకు. ఒక ముంబై ఫ్యాన్‌గా నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదేమి కొత్త కాదు. ప్రతీ సీజన్‌లో అదే జరుగుతోంది. అప్పుడు మళ్లీ అదే జరిగింది. ఇది కేవలం మీకు మొదటి మ్యాచ్ మాత్రమే. తర్వాత మ్యాచ్‌లో మీకు అద్బుతమైన కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా" అని మ్యాచ్ అనంతరం గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తమ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment