గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టులో ఎలాగైనా తిరిగిపుంజుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఇప్పటికే బ్రిస్బేన్‌కు చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి..
అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మూడో టెస్టులో కోహ్లి సెంచరీ సాధిస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు ప్రధాన స్టేడియాల్లో టెస్టు సెంచరీ సాధించిన మూడో పర్యాటక బ్యాటర్‌గా నిలుస్తాడు.
కోహ్లి ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సాధించాడు. అడిలైడ్‌లో మూడు సెంచరీలు (2012, 2014, 2014), పెర్త్‌లో రెండు (2018, 2024), మెల్‌బోర్న్ (2014), సిడ్నీ (2015)లో ఒక్కో సెంచరీ సాధించాడు. కానీ గబ్బాలో మాత్రం కోహ్లి ఇప్పటివరకు ఒక్క సెంచరీ నమోదు చేయలేకపోయాడు.
కాగా ఇప్పటివరకు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ దిగ్గజం అలైస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో ఐదు వేర్వేరు స్టేడియాల్లో సెంచరీలు చేశారు. ఇప్పుడు మరోసారి కోహ్లికి గబ్బాలో సెంచరీ చేసే అవకాశం లభించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే కింగ్ కోహ్లి.. గవాస్కర్, కుక్ సరసన చేరుతాడు.
చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
Comments
Please login to add a commentAdd a comment