సెంచూరియన్ : శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో నెగ్గింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. తొలుత దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా... శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి ఓడింది.