అబుదాబి: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్ అహ్మద్ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
అనంతరం కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులే చేసింది. మున్రో (42 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకం సాధించాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా షాహిన్ ఆఫ్రిది 14 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి సిక్స్ కొడితే ‘టై’ అయ్యే అవకాశం ఉండగా, రాస్ టేలర్ (26 బంతు ల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు) ఫోర్ కొట్టగలిగాడు.
తొలి టి20లో పాక్‌దే విజయం
Published Fri, Nov 2 2018 2:05 AM | Last Updated on Fri, Nov 2 2018 2:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment