
అమ్మాయిలు అదే జోరు..
రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. టి-20 సిరీస్లోనూ అదే జోరు కొనసాగించింది. లంక మహిళల జట్టుతో మూడు టి-20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో మిథాలీ రాజ్ సేన 34 పరుగులతో విజయం సాధించింది. అనూజా పాటిల్ (22 నాటౌట్, మూడు వికెట్లు) ఆల్రౌండ్ షోతో రాణించి జట్టు విజయంతో కీలక పాత్ర పోషించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 36, మందన 35, అనూజా పాటిల్ 22 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లు సుగంధిక కుమారి మూడు, కౌశల్య రెండు వికెట్లు తీశారు. అనంతరం 131 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక పూర్తి ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 96 పరుగులే చేయగలిగింది. దిలాని మనోదర 41 (నాటౌట్) చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. సిరివర్దెనె 18, కరుణరత్నె 14 పరుగులు చేశారు. భారత బౌలర్లు అనూజా పాటిల్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.