
Dinesh Karthik: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 సందర్భంగా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు వింత అనుభవం ఎదురైంది. తన వన్డే డెబ్యూ మ్యాచ్‌లో ప్రత్యర్ధి ఆటగాడిగా ఉన్న అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌గా బరిలో నిలిచాడు. 2004లో డీకే ( నాడు 19 ఏళ్లు) వన్డే అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో (లార్డ్స్) అలెక్స్ (29) ఇంగ్లండ్ తుది జట్టులో బౌలర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్ డీకేకు తొలి మ్యాచ్ అయితే అలెక్స్‌కు వన్డేల్లో మూడవది. ఆ మ్యాచ్‌లో డీకే.. అలెక్స్ క్యాచ్ కూడా పట్టాడు.
ఈ ఆసక్తికర పరిణామం నేపథ్యంలో నెటిజన్లు డీకేపై సెటైర్లు వేస్తున్నారు. క్లాస్ మేట్ టీచర్ అయితే ఎలా ఉంటదో.. ప్రస్తుతం డీకే పరిస్థితి అలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డీకే నిత్య యువకుడు, పోరాట యోధుడు, పడి లేచని కెరటం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంగ్లండ్ తరఫున 13 వన్డేల్లో 18 వికెట్లు పడగొట్టిన అలెక్స్.. 2011లో ఫీల్డ్ అంపైర్‌గా మారాడు. అలెక్స్ ఇప్పటి వరకు 2 టెస్టులు, 8 వన్డేలు, 27 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు.
కాగా, దినేశ్ కార్తీక్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వారంతా ప్రస్తుతం ఆటకు గుడ్‌బై చెప్పి వివిధ హోదాల్లో ఉన్నారు. డీకే సమకాలీకుల్లో చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా, అంపైర్లుగా వ్యవహరిస్తుంటే డీకే మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. సరైన అవకాశాలే లేక మధ్యలో కొద్దికాలం పాటు కామెంటేటర్‌గా వ్యవహరించిన డీకే.. ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష!
Comments
Please login to add a commentAdd a comment