Rohit Sharma: లంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3300) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన గప్తిల్ (3299) పేరిట ఉండగా.. హిట్‌మ్యాన్ ఆ రికార్డును బద్ధలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్‌లో ఔటయ్యాడు.
కెరీర్‌లో ఇప్పటివరకు 123 టీ20లు ఆడిన రోహిత్.. 32.74 సగటుతో 3307 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (3296) మూడో స్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే, శ్రీలంకతో తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో శ్రీలంక 15 ఓవర్లలో 90 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది.
చదవండి: ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్‌తో బరిలోకి దిగవచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment