పెరంబూర్‌కు చెందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు ఎయిర్‌పోర్టులో ఐదు వేల సీమ టపాకాయలను కాల్చడానికి ప్రయత్నించగా, పోలీసులు అభ్యంతరం చెప్పడంతో వాహనాల అవుట్‌గేట్ వద్ద కాల్చి
జగన్ పర్యటనలో సైడ్‌లైట్స్
Published Thu, Dec 5 2013 2:16 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM
పెరంబూర్‌కు చెందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు ఎయిర్‌పోర్టులో ఐదు వేల సీమ టపాకాయలను కాల్చడానికి ప్రయత్నించగా, పోలీసులు అభ్యంతరం చెప్పడంతో వాహనాల అవుట్‌గేట్ వద్ద కాల్చి అభిమానం చాటుకున్నారు.
మిక్కీమౌస్ మాస్కులు ధరించిన ఐసీఎఫ్‌కు చెందిన అభిమానులు చిత్ర విచిత్ర నృత్యాలతో సందర్శకులకు కనువిందు చేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ-హైదరాబాద్-చెన్నై-దుబాయ్ ట్రాన్సిట్ అంతర్జాతీయ విమానంలో ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో దిగారు.
పెరంబూరుకు చెందిన జగన్ అభిమానులు సందర్శకులకు వైఎస్సార్ సీపీ సింబల్ కల్గిన టోపీలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఐసీఎఫ్‌కు చెందిన జగన్ అభిమానులు జగన్ మోహన్‌రెడ్డి ముఖంను పోలిన మాస్కులను ధరించి జగన్ ఒంటరి వ్యక్తి కాదని ప్రజాసమూహ శక్తి అని చాటారు.
సైదాపేట ప్రాంతంలో ఆగవల్సిన జగన్ కాన్వాయ్ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆగకుండా ముందుకు సాగింది.
ఎయిర్‌పోర్టులో నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు జై జగనన్నా ప్లకార్డులు ధరించి 15 నిమిషాల సేపు జగన్‌కు జయజయధ్వానాలు పలికారు.
ఎరైవల్ గేటు నుంచి జగన్ బయటకు రాగానే అభిమానులు ఎయిర్‌పోర్టులోని రైయిలింగులు ఎక్కి, కొత్తగా నిర్మించిన బ్రిడ్జి కమ్మీల మీద ఎక్కి నుంచుకొని ఈలలు, చప్పట్లతో ఎయిర్‌పోర్టును హోరెత్తించారు.
ఇంకా ఐదు నిమిషాల్లో జగన్ కాన్వాయ్‌లోని టయోటా లాండ్ క్రూజర్ వాహనంలో ఎక్కుతారనగా సెక్యూరిటీ బలగాలు నల్లరంగు లాబ్రెడార్ జాతికి చెందిన పోలీసు జాగిలాలతో కారును మొత్తం పరీక్షించారు.
ప్రతి ప్రాంతంలోనూ తమిళనాడు ట్రాఫిక్, పోలీసు విభాగానికి చెందిన అధికారులు జగన్ కాన్వాయ్ సాఫీగా సాగేందుకు ఎంతగానో సహకరించారు.
ఆళ్వారుపేట నుంచి..
ఆళ్వారుపేట బంధుగృహాన్ని సమీపిస్తున్న జగన్ కాన్వాయ్‌కు వైఎస్సార్‌సీపీ టీ షర్టులు ధరించిన జగన్ అభిమానులు జయ జయధ్వానాలు చేస్తూ స్వాగతం పలికారు.
వైఎస్సార్ సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి బస చేసే గృహానికి సమీపించగానే కేరళ సంప్రదాయానికి చెందిన ప్రచండ మేళాన్ని కొందరు కేరళవాసులు ప్రదర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి వారి నైపుణ్యాన్ని చూసి మెచ్చుకోలుగా వారివంక చూశారు.
తిరువళ్లూరు నుంచి 300 మంది జగన్ అభిమానులు మినీ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆయన కాన్వాయ్‌ను ఆళ్వారుపేట వరకూ అనుసరించారు.
ఎయిర్‌పోర్టు నుంచి జగన్‌కు నిర్దేశించిన బస గృహం కేవలం 5 కిలో మీటర్ల దూరంలో ఉన్నా అభిమానులు అడుగడుగునా అడ్డు తగులుతూ రావడంతో కాన్వాయ్ గమ్యం చేరడానికి 2 గంటలు పట్టింది.
Advertisement
Advertisement