Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌ | Today Highlights Today Top 10 News 28 08 2024 | Sakshi
Sakshi News home page

Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌

Published Wed, Aug 28 2024 7:10 PM | Last Updated on Wed, Aug 28 2024 7:32 PM

Today Highlights Today Top 10 News 28 08 2024

1. ఆ వక్రబుద్ధితోనే ఏపీలో ఫిరాయింపులపర్వం!
ఎన్నో అనుమానాల మధ్యే అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెల్చుకుంది చంద్రబాబు టీడీపీ పార్టీ. ఆ వెంటనే ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టి.. అరాచక పాలన కొనసాగిస్తున్నారు. అయినా సంతృప్తి దక్కనట్లుంది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

2. హైడ్రా.. హైదరాబాద్‌ వరకే పరిమితం: సీఎం రేవంత్‌
హైడ్రా హైదరాబాద్‌ వరకే పరిమితం అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీగా పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

3. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్‌ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..
దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

4.పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పు?
పాకిస్తాన్‌ను ఇప్పుడు మరోవైరస్‌ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్‌ఎఫ్‌(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది. పాకిస్తాన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

5.డీఎంకే ఎంపీకి 900 కోట్ల ఈడీ జరిమానా!
డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌కు భారీ షాకిచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్‌తో చర్యలు తీసుకుంది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

6.పేమెంట్‌ చేయాలంటే.. యూపీఐలో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

7. నా కన్నతండ్రి వేధించాడు.. ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది!
రంగుల వెండితెర వెనక దాగి ఉన్న రాక్షస చర్యలు ఎన్నో అంటూ హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల అవస్థలను బయటపెట్టింది. పేరున్న పెద్దలు, పెత్తనం వహించిన తారల చేతిలో ఆర్టిస్టుల బతుకులు చితికిపోతున్నాయని వెల్లడించింది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

8.రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌
ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2017లో ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. తన కెరీర్‌లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1074, 1450, 1892 పరుగులు సాధించాడు.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

9.మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్ : మగజాతి మనుగడకు ముప్పు?
మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం.  ప్రధానంగా పురుషుల్లో ఉండే  వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు..
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

10. పోలవరం నిధుల క్రెడిట్‌ అంతా జగన్‌దే: అంబటి
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి వల్లే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, కానీ సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్‌ తనదే అన్నట్లు ప్రసంగాలు ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement