
'బిగ్‌బాస్'లో మూడోవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. హౌస్‌మేట్స్ దాన్నుంచి బయటకొచ్చేశారు. అంతా ఓకే అనుకునేలోపు.. బిగ్‌బాస్ మరో ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక రతిక వల్ల ప్రశాంత్, యవర్ మెంటలెక్కిపోయారు. ఇంతకీ బిగ్‌బాస్ హౌసులో మంగళవారం ఏం జరిగిందనేది Day-16 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)
మాజీ బాయ్‌ఫ్రెండ్ టాపిక్
ఇక సోమవారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తేజని సేవ్ చేసి, అమరదీప్‌ని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందనేది సందీప్, శోభాశెట్టితో చెప్పుకొచ్చాడు. గతవారం ప్రశాంత్‍కి ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే ఈసారి అమర్‌ని అయితే తట్టుకోగలడని, కచ్చితంగా సేవ్ అవుతాడని అన్నాడు. మరోవైపు తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి పరోక్షంగా మాట్లాడుతున్నారని, దీంతో తన మైండ్ ఆఫ్ అయిపోయిందని రతిక, శివాజీతో మాట్లాడుతూ బాధపడింది.
బాధపడిన ప్రశాంత్
ఇక హౌసులో ఉన్న అందరూ కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పిండితో ముద్దలా చేసి, దానితో గణేశుడి ప్రతిమ చేసుకుని పూజా చేసుకుని, ప్రసాదం తిన్నారు. ఇక అసలు విషయంలోకి వచ్చేసిన బిగ్‌బాస్.. మూడో పవరస్త్ర కోసం తాను ముగ్గుర్ని సెలెక్ట్ చేశానని అమర్‌దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ పేర్లు చెప్పాడు. దీంతో మిగతా వాళ్లలో అసంతృప్తి మొదలైంది. అయితే ఏదో భూమి బద్దలైనట్లు ప్రశాంత్ తెగ బాధపడిపోయాడు. 'ఓడిపోయా.. నేను ఓడిపోయా' అని తనలో తానే అనుకున్నాడు.
(ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!)
ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్
బాధపడుతున్న ప్రశాంత్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్‌బాస్.. పవరస్త్ర కోసం తాను ఎంపిక చేసిన ముగ్గురిలో అనర్హులు అనిపించిన వారి పేరు చెప్పమన్నాడు. సందీప్, శివాజీతో పాటు సెలెక్ట్ అయిన ముగ్గుర‍్ని కాకుండా అందరినీ పిలిచి అనర్హులు అనిపించిన వారి పేరు, అభిప్రాయాలు చెప్పమన్నాడు. అలా అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?
- ప్రశాంత్ - శోభాశెట్టి
- ప్రియాంక - అమర్‌దీప్
- శుభశ్రీ - శోభాశెట్టి
- తేజ - యవర్
- దామిని - యవర్
- గౌతమ్ - శోభాశెట్టి
- రతిక - యవర్
(ఇదీ చదవండి: అవినీతి బాబును వెనకేసుకొస్తోన్న 'టాలీవుడ్' పెద్దలు)
శివాజీ పవరస్త్ర చోరీ
ఓవైపు ఈ గేమ్ జరుగుతుండగానే శివాజీ గెలుచుకున్న పవరస్త్రని అమరదీప్ దొంగతనం చేశాడు. అతడు సైలెంట్‌గా ఏం తెలియనట్లు ఉండిపోయాడు. మరోవైపు ప్రశాంత్ తీశాడమేనని అతడితో రతిక గొడవ పెట్టుకుంది. ఏదో సరదా కోసం అనుకున్న గొడవ కాస్త.. అరిచి గోల గోల చేసుకునేలా మారిపోయింది. ప్రశాంత్, రతికని టచ్ చేస్తూ మాట్లాడటం కాస్త వింతగా అనిపించింది.
రతిక వెన్నుపోటు
ఎవరు అనర్హులో ఏడుగురు కంటెస్టెంట్స్ చెప్పిన వీడియోస్‌ని టీవీలో ప్లే చేసిన బిగ్‌బాస్.. బాంబు పేల్చాడు. తొలుత యవర్ పేరు చెప్పిన వాళ్ల వీడియోలు ప్లే చేశారు. ఈ క్రమంలోనే అతడు తేజతో గార్డెన్ ఏరియాలో గొడవపెట్టుకున్నాడు. అక్కడితో ఈ తతంగం అయిపోలేదు. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయిన యవర్.. స్మోక్ రూంలోని బెంచ్‌పై ఉన్న గ్లాసుని పదేపదే కొడుతూ.. అందరినీ భయపెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో కానీ రతిక తనకు ఈ రేంజులో వెన్నుపోటు పొడుస్తుందని ఊహించని యవర్.. ఇదే విషయాన్ని ఆమెతో చెబుతూ తెగ బాధపడ్డాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా)
Comments
Please login to add a commentAdd a comment