
తెలంగాణ బడ్జెట్ (2018-19) ప్రసంగాన్ని చదువుతున్న ఆర్థికమంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదో భారీ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ కూడా అదే పంథాను అనుసరించింది. రూ.1.74,453 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బడ్జెట్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రివర్గం.. 2018-19 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయనకు వరుసగా ఇది ఐదో బడ్జెట్. ఇక శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది ప్రభుత్వం రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ప్రగతి పద్దుకు రూ.88,038 కోట్లు, నిర్వహణ పద్దుకు రూ.61,607 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు.. అందులోని ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిస్తే..
తెలంగాణ బడ్జెట్ 2018-19 హైలైట్స్..
2018-19 వార్షిక బడ్జెట్ మొత్తం రూ.లక్షా 74వేల 453కోట్లు
రెవిన్యూ వ్యయం రూ.లక్షా 25వేల 454కోట్లు
క్యాపిటల్ వ్యయం రూ.33వేల 369కోట్లు
రాష్ట్ర ఆదాయం రూ.73వేల 751కోట్లు
కేంద్రం నుంచి వచ్చే ఆదాయం రూ.29వేల 41కోట్లు
రెవిన్యూ మిగులు రూ.5,520కోట్లు
నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం
రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతోంది
ఈ ఏడాది వృద్ధి రేటు 10.4గా ఉంటుందని అంచాన
తయారీ రంగంలో వృద్ధి రేటు 7.5శాతం
గత ఏడాది తలసరి ఆదాయం రూ.1,75,534 గతే ఏడాది
వ్యవసాయం
- రైతుపెట్టుబడి సాయం 2018-19 నుంచి ప్రారంభం. ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయం
- రైతు సమన్వయ సమితీల ఏర్పాటు
- 100 రోజుల్లోనే భూరికార్డుల ప్రక్షాళన పూర్తి
- త్వరలో ధరణి వెబ్‌సైట్ ఆవిష్కరణ
- రైతుల పెట్టుబడి సాయానికి రూ.15వేల కోట్లు
- రైతులబీమాకోసం రూ.500కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522కోట్లు
- కోల్డ్ స్టోరేజీ, లింకేజీలకు రూ.132కోట్లు
- బిందు, తుంపర సేద్యానికి రూ.150కోట్లు
- పాలీ గ్రీన్ హౌస్‌కు రూ.120కోట్లు
నీటి పారుదల/విద్యుత్ రంగం
- నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు
- మిషన్ భగీరథకు రూ.1,801కోట్లు
- విద్యుత్‌శాఖకు రూ.5,650కోట్లు
- విద్యుత్ రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం
- గత జనవరి నుంచి 24గంటల విద్యుత్ ఇస్తున్నాం
విద్యారంగం
- విద్యాశాఖకు రూ.10,830కోట్లు
- గురుకుల పాఠశాలలకు రూ.2,828కోట్లు
- ఇప్పటి వరకు 80,048 ఉద్యోగాలను భర్తీ చేశాం.. 27,588 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది
సంక్షేమ రంగం
- మహిళా శిశు సంక్షేమానికి రూ.1,799కోట్లు
- షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలకు రూ.1450కోట్లు
- డబుల్ బెడ్ రూం.ఇళ్లకు రూ.2,643కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.2,946కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.5000కోట్లు
- ఎస్సీల అభివృద్ధికి రూ.16వేల 753కోట్లు
- ఎస్టీలకు రూ.9000కోట్లు పైనే
- దళితులకు భూపంపిణీకి రూ.1,469కోట్లు
- మైనార్టీల సంక్షేమానికి రూ.2000కోట్లు
- రజకుల ఫెడరేషన్‌కు రూ.200కోట్లు
- నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250కోట్లు
- బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు
- జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75కోట్లు
- న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.5,920 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ.12,603కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి రూ.8,063 కోట్లు
- గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం రూ.561కోట్లు
- ఎంబీసీ సంక్షేమానికి రూ.1000కోట్లు
గ్రామీణం / పట్టణం / పరిశ్రమలు
- పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.15,563 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.1,000కోట్లు
- స్థానిక సంస్థలకు రూ.1500కోట్లు
- వరంగల్‌కు 300కోట్లు
- సాంస్కృతిక రంగం రూ.58కోట్లు
- చేనేత టెక్స్‌టైల్స్‌కు రూ.1200 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం రంగం రూ.1281కోట్లు
- ఆర్‌అండ్‌బీశాఖకు రూ.5,575కోట్లు
- స్థానిక సంస్థలకు రూ.1500 కోట్లు
- వైద్య ఆరోగ్యశాఖకు రూ.7375కోట్లు
- పరిశ్రమల రంగానికి రూ.1,286
- ఐటీ పరిశ్రమకు రూ.289కోట్లు
ఆలయాలు
యాదాద్రికి రూ.250కోట్లు
భద్రాచల ఆలయ అభివృద్ధికి 100కోట్లు
బాసర ఆలయానికి రూ.50కోట్లు, ధర్మపురి ఆలయానికి రూ.50కోట్లు
-ఇతరాలు---
- కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి రూ.500 కోట్లు
- ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందిస్తున్నాం
- ఓపీ సేవలకోసం వెల్‌నెస్ సెంటర్లు తీసుకొచ్చాం
- హోంగార్డుల వేతనం రూ.9వేల నుంచి రూ.20వేలకు పెంచాం
- ఐటీలో గణనీయమైన పురోగతి సాధించాం
- గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి
- ఐటీలో మహిళలను ప్రోత్సహించేందుకు ఇటీవలె వీహబ్ ప్రారంభించాం
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణది ప్రథమ స్థానం
- టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు
- కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల సంఖ్య 51శాతం పెరిగింది
- తండాలు, ఆదివాసీ గూడేలను పంచాయితీలుగా మారుస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment