
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' విడుదలకు మరికొన్ని గంటలే ఉంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా జరుగుతున్నాయి. తొలి రోజు షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఇవే కాదు 'ఆదిపురుష్' విషయంలో ఇంకా బోలెడన్ని హైలైట్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేయండి.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!)
- ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో టికెట్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్న ఆడియెన్స్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల‍్లో మొదటి మూడు రోజులు చాలావరకు హౌస్ ఫుల్స్ అయినట్లు తెలుస్తోంది.
- ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్స్‌లో 'ఆదిపురుష్'ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 1500, మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్ లో 3500 స్క్రీన్స్ ఈ మూవీకి కేటాయించారు.
- గతంలో ఏ సినిమాకు లేని విధంగా.. 'ఆదిపురుష్' టికెట్స్ వేల సంఖ‍్యలో కొన్న సెలబ్రిటీలు వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
- 'ఆదిపురుష్' ప్రదర్శించే ప్రతి థియేటర్ లోనూ ఆంజనేయస్వామికి ఓ సీట్ కేటాయించారు.
(ఇదీ చదవండి: Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్)
- 'ఆదిపురుష్' టికెట్ రేటుని తెలుగు రాష్ట్రాల్లో రూ.50 వరకు పెంచారు. అయినాసరే ప్రేక్షకులు, అభిమానులు టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు.
- తెలంగాణలో రిలీజ్ రోజు అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఉదయం 4 గంటలకే మొట్టమొదటి షోలు పడనున్నాయి.
- రామాయణం ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే 'ఆదిపురుష్'ని ఏకంగా రూ.500 బడ్జెట్ తో తీయడం విశేషం.
- తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కొన్నిరోజుల ముందు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేశారని టాక్.
- రూ 500 కోట్ల బడ్జెట్ తో తీసిన 'ఆదిపురుష్' డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని దాదాపు రూ.250 కోట్లకు విక్రయించారట.
- తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ రిలీజ్ హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.185 కోట్లకు దక్కించుకుంది.
- తెలుగు తప్పితే ఓవర్సీస్, హిందీ, ఇతర భాషల్లో 'ఆదిపురుష్'ని నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?)
Comments
Please login to add a commentAdd a comment