తాడ్వాయి న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. శనివారం తాడ్వాయి మండల కేంద్రలోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, బంగారుతల్లి, తదితర పథకాల బాండ్లను అందజేశారు. మండల సమాఖ్యకు బ్యాంకు లింకేజీ కింద *1,28 కోట్ల రుణాల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏను గు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... గతంలో నిర్వహిం చిన రచ్చబండల్లో పలు సమస్యల కోసం దరఖాస్తులు చేకున్న ప్రజలకు ఇప్పటివరకు మంజూరు కాలేదన్నా రు. ఈ రచ్చబండ కార్యక్రమంలోనైనా అధికారులు చొ రవ తీసుకొని అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జనార్ధన్‌గౌడ్, నేరెళ్ల ఆంజనేయులు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పులుగం సాయిరెడ్డి, పీడీలు వెంకటేశ్వర్లు, చైతన్య కుమార్, ప్రేమ్‌కుమార్, ఈవోపీఆర్‌డీ నారాయణ, డిప్యూటీ తహశీల్దార్ ఈశ్వర్, ఏపీ వో విఠల్, ఏపీఎం విఠల్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.