enugu raveendra redddy
-
గులాబీ దళంలో ఆనందం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అవుతుందన్న ప్రచారానికి తెరపడింది. రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేసీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులలో సంతోషం నెలకొంది. కొద్ది రోజులుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడర్లో నెలకొన్న సస్పెన్స్ వీడిపోయింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు, కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. జిల్లాపై ప్రభావం ఇటీవల రాష్ట్రం, దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణ ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని మార్పులు సంభవిస్తాయో? అన్న చర్చ కూడ జరి గింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా? లేదా పొత్తులు ఉం టాయా? అన్న చర్చ ఆ రెండు పార్టీల ఆశావహుల ను కలవరానికి గురి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా జరిగే సాధారణ ఎన్నికలు కీలకం కానున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుంది? మరెవరికి మొండిచెయ్యి ఎదురవుంది? అన్న ఆందోళన వ్యక్తమైంది. అభ్యర్థులు ఎవరో? కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకోగా, ఆశావహులు సోమవారం రాత్రి నుంచే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటే, నాలుగుచోట్ల టీఆర్ఎస్, రెండేసి స్థానాలలో కాంగ్రెస్, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకచోట బీజేపీకి చెం దిన శాసనసభ్యుడు ఉన్నారు. 2009 ఎన్నికలలో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ ఎస్ నుంచి గెలుపొందగా, జుక్కల్, కామారెడ్డి, బాన్సువాడ నుంచి టీడీపీ టికెట్‌పై గెలుపొం దిన హన్మంత్ సింధే, గంప గోవర్ధన్, పోచారం శ్రీని వాస్‌రెడ్డి అనంతరం టీఆర్ఎస్లో కలిశారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. ఆర్మూరుకు జీవన్‌రెడ్డి అభ్యర్థిగా ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. తాజాగా బాల్కొండ అభ్యర్థిగా వేము ల ప్రశాంత్‌రెడ్డి పేరు ఖరారయ్యింది. ఇక తేలాల్సిం ది నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ అభ్యర్థులే. ఈ మూడు నియోజకవర్గాల నుం చి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. -
పేదల కోసమే రచ్చబండ
తాడ్వాయి న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. శనివారం తాడ్వాయి మండల కేంద్రలోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, బంగారుతల్లి, తదితర పథకాల బాండ్లను అందజేశారు. మండల సమాఖ్యకు బ్యాంకు లింకేజీ కింద *1,28 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏను గు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... గతంలో నిర్వహిం చిన రచ్చబండల్లో పలు సమస్యల కోసం దరఖాస్తులు చేకున్న ప్రజలకు ఇప్పటివరకు మంజూరు కాలేదన్నా రు. ఈ రచ్చబండ కార్యక్రమంలోనైనా అధికారులు చొ రవ తీసుకొని అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జనార్ధన్‌గౌడ్, నేరెళ్ల ఆంజనేయులు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పులుగం సాయిరెడ్డి, పీడీలు వెంకటేశ్వర్లు, చైతన్య కుమార్, ప్రేమ్‌కుమార్, ఈవోపీఆర్డీ నారాయణ, డిప్యూటీ తహశీల్దార్ ఈశ్వర్, ఏపీ వో విఠల్, ఏపీఎం విఠల్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.