అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం | Mandal general meeting in munipalli | Sakshi
Sakshi News home page

అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

Published Thu, Dec 8 2016 9:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

 9 నెలలైనా బిల్లులు ఇవ్వరా?
 అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే
 బిల్లులు ఇస్తారా?
  దివంగత సీఎం జయలలితకు నివాళి

 
 మునిపల్లి : మండలంలోని ఆయా శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో మునిపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సభ ప్రారంభం కాగానే తమిళనాడు దివంగత సీఎం జయలలితకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నారని ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అని ఎంపీపీ ఉపాధ్యక్షుడు ఖమ్మంపల్లి మల్లేశంగౌడ్, మక్తక్యాసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార పాటిల్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అంగద్‌పై మండిపడ్డారు.
 
  ప్రజాప్రతినిధులు పోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేయమంటే 9 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. ఎమ్మెల్మే ఫోన్ చేయగానే ఓ ప్రజాప్రతినిధికి మొత్తం బిల్లులు ఇచ్చారని, మిగతా ప్రజాప్రతినిధులకు బిల్లులు ఇవ్వొద్దని ఎవ్వరైనా చెప్పారా? అని ప్రశ్నించారు.
 
  వాటర్ ట్యాంకర్ యజమానులకు ప్రజాప్రతినిధులు బయట అప్పులు తెచ్చి ఇచ్చారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు ఎన్నింటికి అనుమతి ఉంది..? ఎన్నింటికి అనుమతి లేదనే వివరాలను పూర్తి స్థారుులో ఇవ్వాలని జూలేలో కోరితే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఇన్‌చార్జి ఎంఈఓ దశరథ్‌ను ఎంపీపీ మల్లేశంగౌడ్, మక్తక్యసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార్ పాటిల్ నిలదీశారు. పాఠశాలలకు సక్రమంగా ఉపాధ్యాయులు రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
 ప్రజాప్రతినిధులంటే అధికారులకు లెక్కలేకుండా పోరుుందని, ఏది చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంటిపన్నును ముక్కుపిండి వసూలు చేసే పంచాయతీ కార్యదర్శులు మేళసంగంలో శివారులో పత్తి కంపెనీ నిర్మాణం కోసం పన్ను (ట్యాక్స్) కడతానని అనుమతి తీసుకున్నారని, పన్ను కట్టకుండా పనులు నిర్వహించి ఏకంగా పత్తి కొనుగోలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఇన్‌చార్జి ఈఓపీఆర్డీ నాగలక్ష్మిని నిలదీశారు. ‘మాకు సంబంధం లేదు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కే తెలుసు’ అని ఆమె దాటవేశారు.
 
 శ్రీనివాస్ వివరణ ఇస్తూ పన్ను కట్టాలని డిమాండ్ నోటీసు ఇచ్చామన్నారు. రూ.1,502 పన్ను కట్టినట్లు రశీదు ఇచ్చారని సభదృష్టికి తెచ్చారు. ఇంటి యజమానుల నుంచి వేలలో పన్ను వసూలు చేస్తున్న అధికారులు పత్తి కంపెనీ నుంచి ఇంత తక్కువ పన్ను ఏ లెక్కన తీసుకుంటున్నారని పంచాయతీ కార్యర్శి శ్రీనివాస్‌ను నిలదీశారు. 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గల గుట్టలను ఎల్‌అండ్‌టీ సంస్థ జేసీబీలతో తవ్వి అక్రమంగా మొరం తరలిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని తహసీల్దార్ పద్మావతిపై మండిపడ్డారు.
 
  కంకోల్, పెద్దగోపులారం, బుదేరా శివారులోని గుట్టల నుంచి అక్రమంగా మొరం తవ్వి తీసుకెళ్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎల్‌అండ్‌టీ సంస్థ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తహసీల్దార్ పద్మావతి సభదృష్టికి తెచ్చారు. ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సమీక్ష సమావేశంలో పాల్గొని రిజిష్టర్‌లో సంతకాలు చేయాలని సీడీపీఓ రేణుక ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అసద్‌పటేల్, ఎంపీటీసీ సభ్యలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement