తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
Published Tue, Dec 6 2016 2:32 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
మునిపల్లి (నిడదవోలు) : సెల్‌ఫో¯ŒSలో ఎక్కువ సమయం మాట్లాడుతోందని తల్లి మందలించటంతో ఓ యువతి ఫ్యా¯ŒSకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునిపల్లిలో పీతల శాంతి(22) తణుకులోని ఓ హెర్బల్ షాపులో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది. సెల్ ఫో¯ŒSలో చాలా సేపటి నుంచి మాట్లాడటం గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంది. ఆమె నిద్రపోవటానికి వెళ్లిందని భావించిన తల్లిదండ్రులు కుమార్తెను పట్టించుకోలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు కూడా శాంతి తన గది తలుపులు తెరవలేదు. దీంతో కుంటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా ఆమె గదిలో దూలానికి ఉరేసుకుని కనిపించింది. యువతి తండ్రి ఆగమనరావు ఫిర్యాదు మేరకు నిడదవోలు రూరల్ ఎస్సై కె.నరేంద్ర కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement