displeasure
-
సోనియా జీ.. నాకు ఆ అర్హతే లేదా?: నటి నగ్మా
ముంబై: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయ్. నాయకత్వ లోపాల కారణంగా సీనియర్లు సైతం ఓవైపు పార్టీని వీడుతుంటే.. మరోవైపు ఇప్పుడు ‘రాజ్యసభ’ చిచ్చు మరికొందరిలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. తాజాగా మాజీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కాంగ్రెస్‌పై బహిరంగంగానే వ్యతిరేక పోస్ట్ చేశారు. సోనియా జీ.. కాంగ్రెస్ చేరిక సమయంలో రాజ్యసభ సీటును నాకు ఇస్తామని ఆఫర్ చేశారు. 2003 నాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. ఇప్పుడు ఇమ్రాన్(ఇమ్రాన్ ప్రతాప్ఘడిని ఉద్దేశించి)ను మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు పంపిస్తున్నారు. అసలు నాకు ఆ అర్హతే లేదా? అని నగ్మా ట్విటర్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. SoniaJi our Congress president had personally committed to accommodating me in RS in 2003/04 whn I joined Congressparty on her behest we weren’t in power thn.Since then it’s been 18Yrs they dint find an opportunity Mr Imran is accommodated in RS frm Maha I ask am I less deserving — Nagma (@nagma_morarji) May 30, 2022 మా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు వెనుకబడి పోయింది అంటూ ఓ ట్వీట్లో వైరాగ్యం ప్రదర్శించారు ఆమె. हमारी भी १८ साल की तपस्या कम पड़ गई इमरान भाई के आगे । https://t.co/8SrqA2FH4c — Nagma (@nagma_morarji) May 29, 2022 ఇదిలా ఉంటే.. జూన్ 10న జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడు రాష్ట్రాల నుంచి పది మంది సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజిత్ కుమార్, హర్యానా నుంచి అజయ్ మాకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌ఘడి, కర్ణాటక నుంచి జైరామ్ రమేష్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తన్హా, తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తావారి(ముగ్గురు రాజస్థాన్ వాళ్లు కాకపోవడం గమనార్హం) పేర్లను ప్రకటించింది. ఇక బీజేపీ ఎనిమిది రాష్ట్రాల నుంచి 16 మందికి సీట్లు ఖారారు చేసింది. వీరిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్(మహారాష్ట్ర), నిర్మలా సీతారామన్(కర్ణాటక) సైతం ఉన్నారు. Congratulations to all those who made it to the Rajya Sabha @ShuklaRajiv ji Ranjeet Ranjan ji @ajaymaken ji @Jairam_Ramesh ji @VTankha ji @ShayarImran ji @rssurjewala ji @MukulWasnik ji @pramodtiwari700 ji & @PChidambaram_IN ji. And to all those who r selected to the Rajya Sabha https://t.co/GSQ070QgOk — Nagma (@nagma_morarji) May 30, 2022 -
ప్రధాని మోదీకి మళ్లీ అసంతృప్తి..గైర్హాజరుపై గుస్సా
న్యూఢిల్లీ: తన పార్టీకి చెందిన ఎంపీలపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి రాజ్యసభ సమావేశాలకు తక్కువ మంది ఎంపీలే హాజరవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన సమయంలో మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఎంపీ తెలిపారు. కొన్ని బిల్లులపై గతవారం చర్చించాలనుకున్న సమయంలో పలువురు ఎంపీలంతా కూడా తమ నియోజకవర్గాల్లో ఉన్నారని, దాంతో ఆరోజు మధ్యాహ్నం జరగాల్సిన పనులు సాయంత్రం అయ్యాయని, దీనిపై మోదీ అసంతృప్తి ఉన్నట్లు వెల్లడించారు. ఇక పార్టీయేతర ఎంపీలకు సంబంధించిన ప్రైవేటు బిల్లులు మాత్రం కచ్చితంగా శుక్రవారం మాత్రం సభ ముందుకు తీసుకురావాలని మోదీ తెలిపినట్లు వివరించారు. 'శుక్రవారం మీ వంతు.. మిగితా రోజులన్నీ కూడా ప్రభుత్వానివి' అని మోదీ అన్నారట. కచ్చితంగా ఎంపీలు సమావేశాల సమయంలో ఐదు రోజులు హాజరుకావాల్సిందేనని, సిన్సియర్‌గా సభా కార్యక్రమాలకు హాజరుకావాలని ఆదేశించినట్లు వెల్లడించారు. -
జేఎన్‌యూ విద్యార్థి జాడ ఇంకా తెలియలేదా?
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులపై అక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్‌ను ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేకపోయారని, అతడి జాడను కనుక్కోలేకపోయారని ప్రశ్నించింది. దీనిపై పోలీసులు చెప్పిన సమాధానంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 22లోగా పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశిస్తూ ఈ కేసు విచారణను అప్పటి వరకు వాయిదా వేసింది. అదే సందర్భంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. విద్యార్థి ఎన్నికలకు సంబంధించి అహ్మద్ ఉంటున్న గది వద్దకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలు అతడితో గొడవకు దిగారని, దాడి చేశారని అప్పటి నుంచి అహ్మద్ కనిపించకుండా పోయాడని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు పోలీసులు కనుక్కోలేకపోయారని అతడి తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేశారు. -
తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
మునిపల్లి (నిడదవోలు) : సెల్ఫో¯ŒSలో ఎక్కువ సమయం మాట్లాడుతోందని తల్లి మందలించటంతో ఓ యువతి ఫ్యా¯ŒSకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునిపల్లిలో పీతల శాంతి(22) తణుకులోని ఓ హెర్బల్ షాపులో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది. సెల్ ఫో¯ŒSలో చాలా సేపటి నుంచి మాట్లాడటం గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంది. ఆమె నిద్రపోవటానికి వెళ్లిందని భావించిన తల్లిదండ్రులు కుమార్తెను పట్టించుకోలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు కూడా శాంతి తన గది తలుపులు తెరవలేదు. దీంతో కుంటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా ఆమె గదిలో దూలానికి ఉరేసుకుని కనిపించింది. యువతి తండ్రి ఆగమనరావు ఫిర్యాదు మేరకు నిడదవోలు రూరల్ ఎస్సై కె.నరేంద్ర కేసు నమోదు చేశారు.