సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నికల ఏడాది వేళ పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కూడా సీఎం కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలపై విరుచుకుపడ్డారు.
కాగా, మంత్రి కేటీఆర్ బుధవారం నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో అనుకోకుండా ఎంపీగా గెలిచిన వ్యక్తి కూడా రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాడు. కేసీఆర్‌పై అనవసరపు వ్యాఖ్యలు మానకోవాలి. జిల్లాలో ఐటీ టవర్ న్యాక్ సెంటర్, ట్యాంక్ బండ్, మున్సిపల్ నూతన భవనం, వైకుంఠధామాలు అభివృద్ధి కాదా?. దీనికి బీజేపీ ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. మణిపూర్‌లో ఏం జరుగుతుందో చూడాలన్నారు.
బీజేపీ సర్కారు హయాంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అన్ని పెరిగాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ధర 400 ఉంటే 400 తిట్లు తిట్టారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఇదే విషయమై మోదీకి ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ వాళ్లకు గల్లీ వాళ్లకు తేడా ఉంటుంది చూడండి. ఏం చేయాలన్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లాలి. ఈ రెండు పార్టీల బాసులు ఢిల్లీలో ఉంటారు. మాకు తెలంగాణ ప్రజలే బాసులు. మరోసారి ఢిల్లీ వాళ్లకు అవకాశం ఇస్తే ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ బానిసలు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్యే పోటీ ఉంటుంది. పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలు ఢిల్లీ గద్దలను తరిమికొట్టాలి.
ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు మళ్లీ అడుగుతున్నారు. వారికి 10 సార్లు అవకాశం ఇవ్వలేదా?. రైతులకు కరెంట్ కష్టాలు కాంగ్రెస్ హయాంలోనే కదా. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి బయట పడుతున్నారు. ఇదే సమయంలో కేటీఆర్.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ ఓట్ల కోసం కోట్లు ఇచ్చి దొరికిన దొంగ. రేవంత్ తెలంగాణవాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే!
Comments
Please login to add a commentAdd a comment