
దిల్ రాజు.. సినిమాల నిర్మాణంలో సక్సెస్ అయిన నిర్మాత.. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి గ్రామంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. అనేక సూపర్ హిట్ చిత్రాలు నిర్మించి సత్తా చాటారు.. సక్సెస్ ఫుల్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా నిలిచి వెనుదిరిగి చూడలేదు.. తొలి సినిమా దిల్ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.. ఈ సందర్బంగా ఆయన చేసిన పొలిటికల్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి..
పొలిటికల్ ఎంట్రీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికే ప్రాధాన్యత ఇస్తున్నానని అన్న ఆయన తాను పోటీ చేస్తే ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పుకొచ్చారు.. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అలాగే ఆయన సొంత జిల్లా నిజామాబాద్ లో హాట్ టాపిక్ అయ్యాయి..
వాస్తవానికి దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది.. ఇప్పుడు మరోసారి అదే చర్చకు దిల్ రాజే ఆజ్యం పోసినట్టు అయ్యింది.. పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే కాదంటూనే.. ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పడం వెనుక ఆంతర్యం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏ కదా అని వివిధ రాజకీయ పార్టీల్లోని నాయకులు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.. అందులో భాగంగానే ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు.. ఆ పదవిని రెండో మెట్టుగా మలచుకోవడం అందులో భాగమే అని చర్చ స్టార్ట్ అయ్యింది..
దిల్ రాజు వాస్తవానికి చాలాకాలంగా brs కాంగ్రెస్ పార్టీల నేతలతో టచ్ లో ఉంటున్నట్టు టాక్.. నిజామాబాద్ పార్లమెంటు నుంచి లేదా సొంత నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఆయనకు ఇష్టం.. అందుకే ఏ పార్టీలో తనకు బెర్త్ దొరుకుతుంది.. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది.. జిల్లా రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి.. అనే అనేక అంశాలపై దిల్ రాజు ఫోకస్ చేశారు.. కొంతకాలంగా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి brs నుంచి గత రెండు సార్లు సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీ చేశారు.
కాంగ్రెస్ నుంచి మధు యాష్కీ బరిలో ఉన్నారు.. ఈసారి రెండు పార్టీల అభ్యర్థులను బట్టి అక్కడ బరిలోకి దిగాలనే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ అది సాధ్యం కాకపోతే తన సొంత నియోకవర్గమైన నిజామాబాద్ రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆల్టర్ నేట్ ప్లాన్ B కూడా ఉందట.. అక్కడ brs నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఉన్నారు.. కాంగ్రెస్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, అరికెల నర్సారెడ్డి అలాగే నగేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.. నగేష్ రెడ్డి హీరో నితిన్ మేన మామ.. పైగా నగేష్ రెడ్డి నితిన్ లు దిల్ రాజుకు అత్యంత సన్నిహితులు.. ఇలాంటి పరిస్థితులు కూడా దిల్ రాజు పొలిటికల్ గాసిప్స్ కు బలం చేకూరుస్తున్నాయి..
మరోవైపు దిల్ రాజుకు brs కాంగ్రెస్‌లు చాలా కాలంగా గాలం వేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.. మరీ ఏ పార్టీ వైపు వెళ్తారో బరిలో నిలిచేది పార్లమెంట్‌కా లేక అసెంబ్లీకా అది కూడా నిజామాబాద్ జిల్లా నుంచేనా లేక ఇంకా మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందా అనేది తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కే సమయానికి తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment