సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో 2016లో పాలన మరింతగా వికేంద్రీకరించేందుకు కొత్త జిల్లా లు, కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్తగా గ్రామ పంచాయతీలను సైతం ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో మాత్రం అత్యంత ఆవశ్యకత ఉన్నప్పటికీ కొత్త మండలాల ఏర్పాటు మాత్రం జరగలేదు. దీంతో వీటిని ఆశిస్తున్న ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం నుంచి నిజామాబాద్ నగరపాలక సంస్థలో కలిపిన కొన్ని గ్రామాలు, ఆర్మూర్ పురపాలక సంఘం మినహాయించినప్పటికీ, కేవలం మూడు మండలాలైన మాక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండలాల్లో కలిపి 81 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
జిల్లాలోనే ఎక్కువ పంచాయ తీలు ఉన్న మండలాల్లో మొదటి వరుసలో ఉన్నా యి. ప్రస్తుతం ఆర్మూర్ మండలంలో 18 పంచాయతీలు, నందిపేట మండలంలో 33 పంచాయతీలు, మాక్లూర్ మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మండలాల్లోని కొన్ని పంచాయతీలను విడదీసి కొత్తగా రెండు మండలాలు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో భా గంగా నందిపేట మండలం నుంచి కొత్తగా డొంకేశ్వర్ మండలం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో 13 పంచాయతీలు నందిపేట మండలం నుంచి కొత్త మండలంలో కలిపేలా నిర్ణయించారు.
అదేవిధంగా మరోవైపు ఆర్మూర్ మండలం నుంచి కొత్తగా ఆలూ రు పేరిట మండలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి పాదించారు. ఆలూరు మండలం పరిధిలోని ఆర్మూర్‌లోని కొన్ని పంచాయతీలతో పాటు, నందిపేట మండలం నుంచి వెల్మల్, సిద్ధాపూర్, వన్నెల్(కె) పంచాయతీలను, మాక్లూర్ మండలం నుంచి రాంచంద్రపల్లి, కల్లెడ, గుత్ప పంచాయతీలను కలిపేందుకు నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి ప్రక్రి య పూర్తి చేయడంతో పాటు కొత్త మండలాల కోసం అవసరమైన కార్యాలయాల కోసం భవనాలను సైతం చూసి వాటికి రంగులు వేసి మరీ సిద్ధం చేశారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో, అప్పటి కలెక్టర్ యోగితారాణాకు ఉన్న విభేదాల కారణంగా కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పడినట్లు పలువురు చెబుతున్నారు. అప్పటి నుంచి కొత్త మండలాలను ఆశిస్తున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
డిమాండ్లను పట్టించుకోని సర్కారు
ఆర్మూర్ నియోజకవర్గంలో భారీగా గ్రామ పంచాయతీలు ఉన్న మండలాల్లో నుంచి కొత్తగా మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ అది సాకారం కాలేదు. మరోవైపు జిల్లాలో మూడు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలతో కొన్ని మండలాలు ఏర్పాటు కావ డం గమనార్హం. బాల్కొండ నియోజకవర్గంలో ని బాల్కొండ మండలాన్ని మూడు మండలాలుగా విభజించారు. బాల్కొండ, మోప్కాల్, మెండోరా మండలాలు ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ మండలాలు ఏర్పాటయ్యాయి.
అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం నుంచి మొదటగా రుద్రూరు మండలాన్ని విభజించారు. అయితే మండలాల విభజన ప్రక్రియ ముగిసిపోయినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తరువాత కాలంలో కొ త్తగా చందూరు, మోస్రా మండలాలను ఏర్పా టు చేయించారు. దీంతో వర్ని మండలాన్ని నా లుగు మండలాలుగా విభజించినట్లైంది. ఈ నే పథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త మండలాల ఏర్పాటు అంశం వెనక్కి వెళ్లడంతో ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి.
Comments
Please login to add a commentAdd a comment