ఆలూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల కొరత కారణంగా పాఠశాల సరిగా నడవటం లేదంటూ గ్రామస్తులు తాళం వేశారు. కర్నూలు జిల్లా ఆళహరి మండలం నిట్రవట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థినీవిద్యార్థులు చదువుకుంటున్నారు. ఆరు నుంచి పది తరగతులు బోధించేందుకు 15 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా ప్రస్తుతం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు.
ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా టీచర్లను నియమించటం లేదని స్థానికులు విసుగుచెందారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గ్రామస్తులంతా కలసి విద్యార్థులను బయటకు పంపించి వేసి పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు.
టీచర్లను నియమించాలని బడికి తాళం
Published Mon, Nov 16 2015 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM
Advertisement
Advertisement