shortage of teachers
-
సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత..!
సాక్షి సిటీబ్యూరో: మహానగరంలో సర్కారు బడులకు సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారి భర్తీ లేక ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. సబ్జెక్టు టీచర్లతో పాటు భాష పడింతుల పోస్టులు కూడా ఖాళీగా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా నేపథ్యంలో వరసగా రెండేళ్ల పాటు ఆన్లైన్ చదువులు మొక్కుబడిగా సాగడంతో ప్రభుత్వ నిర్ణయంతో పరీక్షలు లేకుండా విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించగా.. ఇటీవల సబ్జెక్టు టీచర్లు లేకుండానే 2022–23 విద్యా సంవత్సరం గడిచిపోయింది. ఫలితంగా పది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో తప్పారు. నూతన విద్యా సంవత్సరం గడువు సమీపిస్తున్నా టీచర్ల భర్తీ ఊసే లేకుండా పోయింది. పడిపోయిన ‘పది’ ఫలితాలు హైదరాబాద్ జిల్లా పరిధిలోని సర్కారు బడుల్లో పది ఫలితాలు మరింత అధ్వానంగా ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 72 శాతం నమోదయ్యింది. 7244 మంది పరీక్షలకు హాజరు కాగా, 2009 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాంపల్లి, బహదూర్‌పురా, చార్మినార్, బండ్లగూడ, సికింద్రాబాద్ మండలాల్లోని బడుల్లో 63 శాతం మించి ఉత్తీర్ణత లేకపోగా, మారేడుపల్లి, హిమయత్‌నగర్, గోల్కొండ, ముషీరాబాద్ మండలాల్లో 75 శాతం మించలేదు. కేవలం తొమ్మిది బడుల్లోనే వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సబ్జెక్టు వారీగా ఫలితాలను పరిశీలిస్తే గణితం 9425, సైన్స్ 6321, ఇంగ్లి ష్ లో 1129, సాంఘికశాస్త్రంలో 1021 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఇక ప్రథమ, ద్వితీయ భాషల్లోనూ కొందరు తప్పారు. ప్రథమ భాష తెలుగులో 1331, హిందీలో 845, ఉర్దూలో 685, ద్వితీయ భాష తెలుగులో 1390, హిందీలో 117, మంది ఉత్తీర్ణత సాధించలేకపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
విలీన స్కూళ్లలో టీచర్ల కొరతకు చెక్
సాక్షి, అమరావతి: నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే చదువుల్లో గట్టి పునాది వేసేందుకు ఫౌండేషన్ స్కూల్ విధానానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పిల్లల్లో ఆరో ఏడు వచ్చేసరికే అక్షర జ్ఙానాన్ని పెంపొందించడం, 3వ తరగతి నుంచి సబ్జెక్టు వారీ బోధనతో ఆ పునాదులను మరింత పటిష్టం చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ స్కూళ్లు అనే ఆరంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అదే ఆవరణ, లేదా 250 మీటర్ల లోపు హైస్కూళ్లకు అనుసంధానిస్తారు. ఈ స్కూళ్లలో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు కూడా సబ్జెక్టులవారీగా మంచి బోధన అందుతుంది. హైస్కూళ్లలోని ల్యాబ్‌లు, గ్రంధాలయాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు కూడా ఈ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రాథమిక పాఠశాలల్లో అందని విజ్ఞానాన్ని ఇక్కడ పొందుతారు. హైస్కూళ్లలో తరగతులు పెరుగుతున్న నేపథ్యంలో టీచర్ల కొరత ఏర్పడకుండా బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసేలా రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ముందుగా పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ను అనుసరించి టీచర్లు అవసరమున్న స్కూళ్లను గుర్తించాలని పేర్కొంది. టీచర్ల సర్దుబాటుకు విధివిధానాలు.. సాధారణంగా 3 నుంచి 10 వరకు సింగిల్ సెక్షన్‌తో నడిచే హైస్కూళ్లలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక స్కూల్ అసిస్టెంట్ (ఎస్.ఏ) (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఇతర సబ్జెక్టులకు 9 మంది స్కూల్ అసిస్టెంట్లు/బీఈడీ అర్హతలున్న ఎస్జీటీలు ఉండాలి. కానీ ఇక్కడ సబ్జె క్టులవారీ టీచర్లను నియమిస్తారు. 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులకు నలుగురు, 6, 7 తరగతుల్లో 6 సబ్జెక్టులకు ఆరుగురు, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టుల బోధనకు ఏడుగురు టీచర్లు ఉండనున్నారు. టీచర్‌కు వారంలో 30 నుంచి 32 గంటలకు మించి పనిభారం పడకుండా, 45 పీరియడ్లకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీచర్ల సర్దుబాటుకు ప్రస్తుతం స్కూల్ కాంప్లెక్సు, మండల, డివిజన్, జిల్లాలవారీగా మిగులు టీచర్లను గుర్తించాలి 6, 7 తరగతుల విద్యార్థుల సంఖ్య 35కన్నా తక్కువగా ఉన్నా, మ్యాపింగ్ తరువాత 75 కన్నా తక్కువగా విద్యార్థులున్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని ఎస్ఏలను గుర్తించాలి. ఎస్జీటీలలో బీఈడీ అర్హతలున్న వారిని గుర్తించాలి. వీరిని స్కూల్ కాంప్లెక్సు, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో మ్యాపింగ్ పూర్తయిన స్కూళ్లలో సర్దుబాటు చేయాలి 20 కన్నా విద్యార్థులు తక్కువ ఉన్న స్కూళ్లలో ఇద్దరు ఎస్జీటీలు ఉంటే వారిలో ఒకరిని హైస్కూలుకు డిప్యుటేషన్‌పై పంపాలి. ఇందుకు అధిక విద్యార్హతలున్న వారిని ఎంపిక చేయాలి. హైస్కూలుకు డిప్యుటేషన్‌పై వెళ్లే ప్రాథమిక స్కూళ్ల టీచర్లు హైస్కూలు హెడ్మాస్టర్ పర్యవేక్షణలో ఉంటారు. ఒకే ఆవరణలో లేదా 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు హైస్కూలుకు అనుసంధానమయ్యే చోట అక్కడి మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది కూడా అదే రీతిలో సర్దుబాటు అవుతారు. 3, 4, 5 తరగతులు హైస్కూళ్లలో విలీనమయ్యే ప్రాథమిక పాఠశాలలకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేయాలి. -
అయ్యవార్లు లేరు!
సర్కార్ బడులు అయ్యవార్ల కొరతతో అల్లాడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో తరగతులు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో పాఠ్య పుస్తకాలు రాక ఇన్నాళ్లూ బోధన పడకేయగా.. ఇప్పుడు ఉపాధ్యాయుల కొరతతో అదే పరిస్థితి పునరావృతమైంది. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వీటి భర్తీపై ప్రభుత్వం కనీసం దృష్టిసారించడం లేదు. డిప్యుటేషన్లు కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారి ఫైల్ కూడా ముందుకు కదల్లేదు. ఫలితంగా.. సర్కార్ విద్య మిథ్యగా మారింది. వీరఘట్టం శ్రీకాకుళం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉపాధ్యాయుల కొరతే. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో దీని ప్రభావం బోధనపై పడింది. ఎక్కువ ఉపాధ్యాయులు ఉండి తక్కువ మంది విద్యార్థులు ఉండే పాఠశాలలు, అలాగే విద్యార్థులు ఎక్కువ మంది ఉండి తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండే పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు జూలై రెండో తేదీలోగా నివేదికలు ఇవ్వాలని జూన్‌లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖాధికారులు ఆఘమేఘాల మీద నివేదికలు తయారు చేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ఈ నివేదికలు పంపించి నెల రోజులు గడుస్తున్నా ఫైల్ ముందుకు కదల్లేదు. కలెక్టర్ ఆమోదం కోసం ఫైల్ ఎదురుచూస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిలిచిపోవడంతో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లేక బోధన జరగని పరిస్థితి నెలకొంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఈ ప్రక్రియపై విద్యాశాఖాధికారులు స్పందించకపోడవంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 2,370 ప్రాథమిక, 431 ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 477 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 2,53,833 మంది ఈ ఏడాది విద్యనభ్యసిస్తున్నారు. డైస్ లెక్కల ప్రకారం వీరికి పాఠ్యాంశాలుబోధించేందుకు 14,218 మంది ఉపాధ్యాయులు ఉండాలి. అయితే ప్రస్తుతం 13,393 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 825 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా సర్దుబాటే! టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరగలేదు. దీంతో విద్యాశాఖ ప్రతీ ఏటా సర్దుబాటు పేరుతో కాలయాపన చేస్తోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయులు తక్కువగా ఉండడం, అలాగే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువగా ఉండే పాఠశాలలను గుర్తించి సర్దుబాటుతో సరిపెడుతున్నారు. ఈ ఏడాది కూడా సర్దుబాటు ప్రక్రియ త్వరగా ప్రారంభమైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడంతో ఈ ఫైల్ ముందుకుకదల్లేదు. సంబంధిత ఫైల్ ఏకంగా బుట్టదాఖలైనట్టేననే అనుమానాన్ని సైతం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్ కోసం 73 మంది ఎదురుచూపు టీచర్ల పని సర్దుబాటు జరగకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 73 మంది స్కూల్ అసిస్టెంట్లు తమకు అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫైల్‌ను జిల్లా కలెక్టర్ అనుమతుల కోసం విద్యాశాఖ అధికారులు పంపించారు. అయితే ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడంతో జిల్లా కలెక్టర్ ఈ ఫైల్‌ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కొన్ని పాఠశాలల్లో ఉదాహరణకు ఇలా.. వీరఘట్టం మండలం గడగమ్మ, పాలమెట్ట, అడారు, తెట్టంగి, వీరఘట్టం కూరాకులవీధి, బిటివాడ ప్రాథమిక పాఠశాలల్లో 6 ఎస్జీటీ పోస్టులు, సంతనర్శిపురం హైస్కూల్లో ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టు, తెట్టంగి హైస్కూల్లో తెలుగు పండిట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు రిటైర్డ్ కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే ఆగస్టు నెలలో చేబియ్యంవలస, కొంచ ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంటే వీరఘట్టం మండలంలో 10 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల విక్రమపురం పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో ఇక్కడ కూడా ఓ ఖాళీ ఏర్పడింది. అలాగే పాలకొండ మండలం తంపటాపల్లి, ఓని పాఠశాలల్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వంగర మండలంలో 11, సంతకవిటిలో 14, రాజాంలో 12, రేగిడిలో 9.. ఇలా జిల్లా వ్యాప్తంగా 250 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించారు. వీటితో పాటు గత నాలుగేళ్లుగా పదవీ విరమణ చేసిన 575 మంది ఉపాధ్యాయ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో అంతమంది ఉపాధ్యాయుల అవసరం లేనప్పటికీ జిల్లాలో 250 పోస్టులు సర్దుబాటు చేయాల్సి ఉందని విద్యాశాఖ అధికారులంటున్నారు. హిందీపై పట్టు కోల్పోతున్నారు.. వీరఘట్టం మండలం నడిమికెల్ల యూపీ పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే హిందీ పండిట్ లేకపోవడంతో విద్యార్థులు సబ్జక్టుపై పట్టుకోల్పోతున్నారు. ఇలా జిల్లాలో చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలి. – బంకురు అప్పలనాయుడు, పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సభ్యుడు -
ఉపాధ్యాయ ‘మిథ్య’
డైట్ కాలేజీల్లో కుంటుపడుతున్న బోధన - ఒకే గదిలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు పాఠాలు - తెలుగు మీడియంలోనే బోధన.. ఇంగ్లిష్ మీడియం వారికి గందరగోళం - ఇలా తెలుగులో డీఎడ్ చేస్తే.. ఇంగ్లిష్‌లో బోధించేదెలా? - పట్టించుకోని ప్రభుత్వం, డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులనైనా భర్తీ చేయని వైనం - అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు.. 80% పోస్టులు ఖాళీ ఇది మహబూబ్‌నగర్‌లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లోని తరగతి గది. డీఎడ్ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థుల్లో ఒక వైపు ఉన్నది తెలుగు మీడియం వారుకాగా.. మరోవైపు ఉన్నది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు. రెండు మీడియంల వారికి ఒకే తరగతి గదిలో తెలుగులోనే బోధన జరుగుతోంది. బోధించే అంశాలు అర్థంకావట్లేదు నేను ఏడో తరగతి నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నా. ఉపాధ్యాయ శిక్షణకు ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశం పొందాను. కాని రెండు మీడియంల విద్యార్థులను కలిపి కూర్చోబెట్టి.. తెలుగులో బోధించడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. సరిగా అర్థం కావడం లేదు కూడా.. - కె.చరణ్, వరంగల్ ఇంగ్లిష్ మీడియం విద్యార్థి ప్రత్యేకంగా బోధించేలా చర్యలు.. ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాం. గెస్ట్ లెక్చరర్లను నియమిస్తాం. అక్టోబర్, నవంబర్లలో ఓరియంటేషన్ తరగతులను నిర్వహించబోతున్నాం. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ అమల్లోకి వచ్చాక పదోన్నతులు ఇవ్వాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..’’ – బి.శేషుకుమారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదరాబాదరాగా మొదలు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించింది. భవిష్యత్తులో వాటిల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించే ఉపాధ్యాయ అభ్యర్థుల అవసరాన్ని గుర్తించి.. ఈసారి నుంచి ఇంగ్లిష్ మీడియంలోనూ డీఎడ్ కోర్సును ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా చేరారు. కానీ అధ్యాపకుల కొరత కారణంగా ఇంగ్లిష్ మీడియంలో బోధన జరపలేని పరిస్థితి నెలకొంది. తెలుగులోనే బోధన కొనసాగుతోంది. దీంతో ఈ అభ్యర్థులు ఇంగ్లిష్ మీడియం టీచర్లు ఎలా అవుతారు, విద్యార్థులకు ఎలా బోధిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్తగా ఒక్క పోస్టూ ఇవ్వని వైనం రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు కాకుండా 10 డైట్లు ఉన్నాయి. ఒక్కో డైట్లో 100 డీఎడ్ సీట్లు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరానికిగాను వీటిలో 50 సీట్లను తెలుగు మీడియం విద్యార్థులతో, మరో 50 సీట్లను ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో భర్తీ చేశారు. కానీ ఇంగ్లిష్ మీడియం బోధనకు అధ్యాపకులను ఇవ్వడం మరచిపోయారు. విద్యాశాఖ ఆ కోర్సును బోధించేందుకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేయలేదు. ఇప్పటికే అరకొరగా ఉన్న తెలుగు మీడియం లెక్చరర్లతోనే నెట్టుకొస్తోంది. కనీసం ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదు. వాస్తవానికి డైట్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాల్సిన పోస్టులకు సర్వీసు రూల్స్ సమస్య ఉంది. ఈ సమస్య లేని డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులనైనా భర్తీ చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం సరిపడా తాత్కాలిక లెక్చరర్లనైనా నియమించలేదు. దీంతో ఇంగ్లిష్ మీడియం డీఎడ్‌ను ప్రవేశపెట్టినా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్‌లోని డైట్ తరగతి గది ఇది. ఇక్కడా ఓవైపు తెలుగు మీడియం, మరోవైపు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు. లెక్చరర్ బోధిస్తున్నది తెలుగులోనే. రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో నెలకొన్న దుస్థితి ఇది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియంలో డీఎడ్ కోర్సు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు కూడా తెలుగు మీడియమే దిక్కవుతోంది. డైట్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతే దీనికి కారణమవుతోంది. అంతేకాదు ఏకంగా 80 శాతం ఖాళీలు ఉండడంతో తెలుగు మీడియంలో బోధన కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఎస్సీఈఆర్టీ దృష్టికి తీసుకెళ్లాం అధ్యాపకుల కొరత కారణంగా తెలుగు, ఇంగ్లిష్ మీడియంల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిం చాల్సిన పరిస్థితి ఉంది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బో«ధనకు 16 మంది కావాలి. ఎంత సర్దుబాటు చేసినా 8 మంది అయినా అవసరం. కానీ అందుబాటులో లేరు. రెండు మీడియంల విద్యార్థులతో కంబైన్డ్ క్లాస్‌లు నిర్వహించాలని విద్యాశాఖ చేసిన సూచన మేరకు బోధన కొనసాగిస్తున్నాం.. రవికుమార్ వరంగల్ డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ -
బోధకులెక్కడ?
ట్రిపుల్ ఐటీలను పీడిస్తున్న బోధన సిబ్బంది కొరత తాత్కాలిక మెంటార్లు, లెక్చరర్లే గతి ఉద్యోగ భద్రత లేక వారూ వెళ్లిపోతున్నారు విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పట్టించుకోని ఆర్జీయూకేటీ పాలకులు మహానేత వైఎస్సార్ ఆశయాలకు తూట్లు! నూజివీడు: పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలను బోధన సిబ్బంది కొరత పీడిస్తోంది. ఏర్పాటు చేసి ఎనిమిదేళ్ళైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు బోధన సిబ్బంది పోస్టుల భర్తీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో ఏర్పాటు చేసిన నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలలో పనిచేస్తున్న మెంటార్ల, లెక్చరర్ల కొరతతో పాటు, వారికున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ముఖం చాటేస్తున్న మెంటార్లు ఇక్కడ విద్యార్థులకు బోధించే ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యలో భాగంగా మొదటి రెండేళ్ళు పియూసీ కోర్సులను, తరువాత నాలుగేళ్ళు ఇంజినీరింగ్ కోర్సుల్లో నిపుణులుగా తయారుచేస్తారు. పీయూసీ విద్యార్థుల కోసం 230 మంది మెంటార్లను నియమించగా, వీరిలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ప్రస్తుతం రెండు క్యాంపస్‌లలో కలిపి 100 మంది మెంటార్లు, మాత్రమే ఉన్నారు. లెక్చరర్ల కొరత అయితే చెప్పనవసరమే లేదు. ఇంజినీరింగ్ కోర్సులకు ఉన్న కొరతను అధిగమించడానికి ట్రిపుల్‌ఐటీలోనే కోర్సు పూర్తిచేసిన విద్యార్థులను టీచింగ్ అసిస్టెంట్ల పేరుతో తాత్కాలిక పద్ధతిలో నియమించుకుంటున్నారు. పరిష్కారం చూడరా? ట్రిపుల్ఐటీలలో మెంటార్లు, లెక్చరర్లు అడుగడుగునా సమస్యలే. ఎనిమిదేళ్లు గడిచినా ఇంతవరకు ఉద్యోగభద్రత లేదు. వారిని పర్మినెంట్ చేయలేదు. దీంతో వారిలో ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం, ఆసక్తి రానురాను తగ్గిపోతోంది. బోధకుల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కడం లేదు. దీని పరిష్కరానికి ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్ ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నూజివీడు ట్రిపుల్ఐటీలోని పలు బ్రాంచిలలో లెక్చరర్, విద్యార్థుల నిష్పత్తి 1:100గా ఉంటోంది. పియూసీలో కూడా లెక్చరర్, విద్యార్థుల నిష్పత్తి 1:80వరకు ఉంది. బోధన సిబ్బంది కొరత ఇలా ఉంటే బోధనాసిబ్బందికి తెలియకుండానే ఉన్నతాధికారులు ప్రతిఏటా కరిక్యులమ్ మారుస్తూ మరింత ఒత్తిడి గందరగోళం పెంచుతున్నారు. అదనంగా శ్రీకాకుళం,ఒంగోలు ట్రిపుల్‌ఐటీల భారం ఉన్నవాటినే సిబ్బంది కొరత వెంటాడుతుంటే ప్రభుత్వం శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలను ప్రారంభించి మెంటార్లు, లెక్చరర్లపై అదనపు భారం మోపింది. ఈ నేప«థ్యంలో ట్రిపుల్ ఐటీల్లో నాణ్యత ప్రమాదంలో పడిందనే ఆందోళనలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి. -
ఏళ్లతర'బడి' సమస్యలే..
నేడు విద్యాశాఖ మంత్రి సమీక్ష సంగారెడ్డి మున్సిపాలిటీ: సర్కార్ బడులు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. శిథిల భవనాలు భయపెడుతున్నాయి. గదుల కొరతతో ఆరుబయటే పాఠాలు. కనీస సౌకర్యాల దిక్కే లేదు. ఈ దశలో ప్రభుత్వ పాఠశాలల వైపు రావడానికి విద్యార్థులు జంకుతున్నారు. బడిబాట కార్యక్రమాన్ని పెట్టినా ఆశించిన మేర విద్యార్థులు చేరకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారం సంగారెడ్డిలో విద్యా వ్యవస్థపై ఆ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెల కొన్న విద్యారంగ సమస్యలను ఏ మేరకు పరిష్కరిస్తారనే ఆసక్తితో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,974 ప్రాథమిక పాఠశాలలు, 420 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌తోపాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈనెల 2 నుంచి 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినా ఆశించిన స్థాయిలో సర్కార్ బడుల్లో విద్యార్థులు చేరలేకపోయారు. మరోవైపు జిల్లాలో 3,289 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా 127 పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతపడే పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి, మూత్రశాలల సదుపాయం కల్పించాలి. కానీ జిల్లాలో ఇప్పటివరకు 1,260 పాఠశాలల్లో విద్యార్థులు తాగేందుకు నీటి వసతిని కల్పించలేకపోయారు. 13 పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు నిర్మించలేని పరిస్థితి. మొత్తంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ స్థానికంగా ఉపాధ్యాయుల్లో నెలకొన్న సమన్వయంతోపాటు ఉపాధ్యాయుల కొరత, తరగతి గదులు సరిపోనందున కేవలం 117 పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నిర్వహించే సమీక్ష సమావేశంలో ఏ మేరకు సమస్యలను పరిష్కరిస్తారో వేచి చూడాలి. -
ఏడుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు
చిత్తూరు: జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉట్టిపడుతున్నా ఆ పాఠశాలలో మాత్రం దాదాపు విద్యార్థుల సంఖ్యకు సమానంగా టీచర్లను నియమిస్తుంటారు. అందరికీ తెలిస్తే బాగుండదని అందులో కొందర్ని డెప్యుటేషన్‌పై అదే మండలంలోని ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తుంటారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది ఎక్కడ.. ఎందుకు అనుకుంటున్నారా?.. అయితే మీరే చదవండి..! కలకడ మండలం కె.దొడ్డిపల్లెలో మొత్తం 60 కుటుంబాలుంటాయి. ఇందులో బడికి వెళ్లే వారు 25 మందిదాకా ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు ఏడుగురే హాజరవుతున్నారు. రికార్డుల ప్రకారం 1వ తరగతిలో నలుగురు, 2వ తరగతిలో నలుగురు, 3వ తరగతిలో-1, 5వ తరగతిలో-2, 6వ తరగతిలో-2, 7వ తరగతిలో 4 ఉన్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏడుగురికి ఐదుగురు ఉపాధ్యాయులు ప్రస్తుతం పాఠశాలకు హాజరవుతున్న ఏడుగురి విద్యార్థులకు ఐదుగురు టీచర్లను నియమించారు. మంగళవారం మొత్తం ఎనిమిది మంది హాజరుకాగా అందులో ఓ విద్యార్థి అంగన్వాడీకి చెందింది కావడం గమనార్హం. దుస్థితిలో పాఠశాల భవనం పాఠశాల భవనం దుస్థితికి చేరింది. చినుకుపడితే గొడలు నెమ్మెక్కుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపడం మానేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆరుగుర్ని ప్రయివేటు పాఠశాలకు పంపుతున్నట్టు తెలిసింది. మొదట్నుంచీ అంతే నాలుగేళ్లుగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్నట్టు సమాచారం. గత ఏడాది 14 మంది విద్యార్థులకు గాను ఏడుగురు ఉపాధ్యాయుల్ని నియమించారు. వీరిలో కొందర్ని డెప్యూటేషన్‌పై పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి, అందులో ఇద్దర్ని ఇతర పాఠశాలకు పంపాల్సి వచ్చింది. విద్యార్థుల సంఖ్య పెరగకుంటే పాఠశాల మూసివేస్తామని విద్యాధికారులు చెబుతున్నట్టు సమాచారం. విద్యార్థుల సంఖ్య పెంచుతాం పాఠశాలలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. అలాగే మరో పది మందిని చేర్పించేందుకు తల్లిదండ్రులతో చర్చలు జరుపుతున్నాం. బడిపిలుస్తోంది కార్యక్రమం ముగిసేలోపు మరింత మందిని చేర్పిస్తాం. - శ్రీనివాసులురెడ్డి, ప్రధానోపాధ్యాయుడు. -
టీచర్లను నియమించాలని బడికి తాళం
ఆలూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల కొరత కారణంగా పాఠశాల సరిగా నడవటం లేదంటూ గ్రామస్తులు తాళం వేశారు. కర్నూలు జిల్లా ఆళహరి మండలం నిట్రవట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థినీవిద్యార్థులు చదువుకుంటున్నారు. ఆరు నుంచి పది తరగతులు బోధించేందుకు 15 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా ప్రస్తుతం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా టీచర్లను నియమించటం లేదని స్థానికులు విసుగుచెందారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గ్రామస్తులంతా కలసి విద్యార్థులను బయటకు పంపించి వేసి పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. -
టీచర్ల నియామకాలు చేపట్టండి
♦ ఆ మేరకు మూడు వారాల్లో చర్యలు చేపట్టండి ♦ తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం ♦ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతపై తీవ్ర అసంతృప్తి న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరతపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల నియామకాలు చేపట్టేందుకు మూడు వారాల్లో చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశించింది. ‘‘రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన టీచర్లను నియమిస్తున్నారు. గ్రామాల్లోని స్కూళ్లలో టీచర్లు ఎందుకు ఉండరో మాకు అర్థం కావడం లేదు. మేం ఈ పరిస్థితులపై వ్యాఖ్యానించక తప్పడం లేదు. మేం మనసులో ఒకటి అనుకొని అది బయటకు చెప్పకపోతే కపటమే అవుతుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన అనంతరం బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్‌పైనా అసంతృప్తి వ్యక్తంచేసింది. గతంలో ఇంతకుముందు వెలువరించిన ఆదేశాలను పాటించలేదని పేర్కొంది. టీచర్లను నియమించి, పిల్లలకు విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లు కూడా ఉపాధ్యాయ ఎంపికలో పాల్గొనవచ్చని తెలిపింది. డిసెంబర్ 8న స్కూళ్లలో టాయిలెట్ల పరిస్థితిపై విచారణ చేపడతామని వెల్లడించింది. -
టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేశాం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టామని టీ సర్కార్ హైకోర్టుకు నివేదించింది. ఈ ఏడాది జూలై 31 నాటికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేశామని తెలిపింది. రాష్ట్రం లోని పాఠశాలల్లో ఓ తీరులేని విధానం ఉన్న ట్లు గుర్తించామని, కొన్ని స్కూళ్లలో టీచర్లు ఎక్కువ ఉంటే విద్యార్థులు తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉండటాన్ని గమనించి, దాన్ని సరిచేశామని వివరించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ ప్రజా ప్రయోజనాన్ని హైకోర్టు విచారిస్తుందో, ఆ లక్ష్యాన్ని తాము పూర్తి చేశామని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని మూసివేయాలని కోరింది. తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు, ఐజ మండలాల పరిధిలోని బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరగిడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి దాదాపు 1700కు పైగా లేఖలు రాశారు. ఈ లేఖలన్నింటినీ పరిశీలించిన ఆయన వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మరోసారి విచారించి, అసలు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 26050 పాఠశాలలున్నాయని, వీటికి మొత్తం 112692 టీచర్ పోస్టులను కేటాయించామని (పీఈటీ, హెడ్మాస్టర్లు మినహాయించి) ఆయన తెలిపారు. ఇందులో 101731 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారని, మిగిలిన 10961 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తీసుకున్న చర్యలు... ►పాఠశాలల్లో ఓ క్రమపద్ధతిలో లేని విధానాన్ని సవరించి, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ కోసం ఈ ఏడాది జూన్ 16న జీవో 11 జారీ చేశాం. ►జీవో 11కు సమాంతరంగా ఉపాధ్యాయుల బదిలీల నిమిత్తం జీవో 12 జారీ చేశాం. దీనికి అనుగుణంగా హేతుబద్ధీకరణను పూర్తి చేసి, బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించాం. జూలై 7 నుంచి 31 వరకు కౌన్సెలింగ్ నిర్వహించాం. ►బదిలీ కౌన్సిలింగ్ సమయంలోనే కొన్ని పాఠశాలలకు అసలు టీచర్లే లేరన్న విషయాన్ని గుర్తించాం. ►దీనిని అధిగమించేందుకు విద్యాశాఖ ఈ ఏడాది జూలై 13న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఉపాధ్యాయుల్లో జూనియర్ అయిన వ్యక్తి తను ఏ పాఠశాలలో పనిచేసి, బదిలీపై మరో చోటుకు వెళ్లాడో అతను తిరిగి తను పనిచేసిన పాఠశాలలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంత వరకు పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేశాం. ►ఖాళీలను విద్యా వలంటీర్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించాం. భర్తీ ప్రక్రియను గత నెల 21కల్లా పూర్తి చేశాం. ►ఇక మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు, ఐజా మండల్లాలోని ఏడు పాఠశాలల విషయానికొస్తే, ఈ 7 పాఠశాలల్లో మొత్తం 1960 మంది విద్యార్థులుంటే, 41 టీచర్ పోస్టులను కేటాయించాం. ఇందులో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు 11 మంది, విద్యా వలంటీర్లు 11 మంది ఉన్నారు. 27.8.15న మరో 20 ఉపాధ్యాయులను ఈ పాఠశాలల్లో నియమించాం. -
టీచర్లేరి ?
♦ విద్యార్థులను వేధిస్తున్నటీచర్ల కొరత ♦ జిల్లాలో 721 ఏకోపాధ్యాయ, 223టీచర్ లేని స్కూళ్లు ♦ మల్లాపూర్ పాఠశాలలో ఒక్క విద్యార్థికి నలుగురు టీచర్లు ♦ రేషనలైజేషన్, బదిలీల తర్వాత కూడా అదే పరిస్థితి మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అట కెక్కాయి. సరిపోయినంత మంది టీచర్లను నియమించకుండా ప్రభుత్వాలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది స్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నాయి. సన్నబియ్యం, దుస్తులు, ఆరోగ్యకార్డులు, ఉపకారవేతనాలు ఇలా కొత్త పథకాలను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న ప్రభుత్వం అధికారులు.. బోధించాల్సిన ఉపాధ్యాయులను మాత్రం నియమించడం లేదు. అనేక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒక్కరే టీచర్ ఉన్నారు. మరికొన్నిం టిలో ఆ ఒక్కరు కూడా లేరు. అయితే, వీటికి విరుద్ధంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకంటే టీచర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు కూడా బదిలీ కావడంతో పాఠశాలల నిర్వహ ణ కష్టంగా మారింది. కొత్తూరు మం డలం మల్లాపూర్ పాఠశాలలో ఒక్క విద్యార్థికి నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో రేషనలైజేషన్, బదిలీల తర్వాతా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, విధులకు డుమ్మా కొట్టడం, సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల దుస్తితి ధారుణంగా తయారైంది. అక్షరాస్యతలో వెనకబడిన గట్టులాంటి మండలాల పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులులేక విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఖాళీగా కూర్చొని వెళ్తున్న పరిస్థితి ఉంది. చదువుకుంటాం టీచర్లను నియమించండని విద్యార్థులు హైకోర్టుకు రాసిన లేఖ లతో హైకోర్టు స్పందించింది. డుమ్మా లు కొడుతున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని.. జిల్లా విద్యాశాఖాధికారిపై ఎందుకు చర్యలు తీసుకొవద్దంటూ నోటీసులు రావడంతో అధికారుల్లో.. పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయుల్లోనూ గుబులు మొదలైంది. జిల్లాలో 1794 ఖాళీలు.. జిల్లాలో మొత్తం 2,725 ప్రాథమిక పాఠశాలలు, 578 ప్రాథమికోన్నత పాఠశాలలు, 657 ఉన్నత పాఠశాలలు, 47 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వాటిలో మొత్తం 4,59,819 మంది విద్యార్థులున్నారు. వారికి ప్రభుత్వం గతంలో జిల్లాకు అన్ని కేటగిరిలలో కలిపి మొత్తం 17,407 పోస్టులను మంజూరు చేసింది. కానీ ప్రస్తుతం 15,745మంది ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఇంకా 1662మంది ఉపాధ్యా య ఖాళీలున్నాయి. ఇటీవల మరో 132 ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం 1794 ఖాళీలున్నాయి. వీటిలో 1100కు పైగా ఎస్జీటీ పోస్టులు ఖాళీలున్నాయి. కానీ, విద్యాశాఖమంత్రి మాత్రం ఎస్జీటీ ఖాళీలు లేవని, ఇప్పట్లో డీఎస్సీ లేదని ప్రకటించడం గమనార్హం. రేషనలైజేషన్‌లో ఎన్ని సర్దుబాటు చేశారనేది నెలరోజులు గడుస్తున్నా జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం లెక్క తేల్చలేదు. విద్యార్థులు తక్కువ... టీచర్లు ఎక్కువ హేతుబద్ధీకరణ తర్వాతా కూడా జిల్లాలో చాలా పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ► కొత్తూరు మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థికి నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆ విద్యార్థి కూడా 18ఏళ్లు నిండిన మానసిక వికలాంగుడు కావడం గమనార్హం. ► కొత్తూరు మండలం యూపీఎస్ కుమ్మరిగూడలో 27మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు ఉన్నారు. ►ఖిల్లా ఘనపూర్ మండలం మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో 23మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక్కరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. గతంలో 6,7 తరగతులు నిర్వహిస్తుండే వారు. ప్రస్తుతం రెండేళ్లుగా ఆ తరగతుల నిర్వహణ లేదు. కానీ, ఆ పాఠశాలలో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు లాంగ్వేజ్ పండిట్లు, ఇద్దరు ఎస్జీటీలు మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ► నారాయణపేట మండలం నంబూలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. -
మాకు టీచర్లు కావాలి!
-
మాకు టీచర్లు కావాలి!
ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టు సీజేకు 1,600 మంది విద్యార్థుల లేఖలు వాటిని సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయండి అలసత్వం ప్రదర్శించే అధికారులపైనా చర్యలు తీసుకోండి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం విచారణ 20కి వాయిదా హైదరాబాద్: బడికి రాని టీచర్లపై, బాధ్యత తప్పిన సర్కారుపై... బడి పిల్లలు చేపట్టిన పోరాటం హైకోర్టును కదిలించింది. చదువు కోసం ఆ చిన్నారుల ఆరాటం న్యాయమూర్తులను చలింపజేసింది. ఆ పిల్లల లేఖలే రాష్ట్ర ప్రభుత్వంపై, అలసత్వపు అధికారులపై అస్త్రాలుగా మారాయి. బడికి డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చేలా చేశాయి. దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరేలా చేశాయి.తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు రాసిన లేఖలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం గా స్వీకరించింది. నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటువంటి వారిని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విద్యార్థులకు సరపడా ఉపాధ్యాయులను నియమించడంలో అలసత్వం ప్రదర్శించే విద్యాశాఖ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియచేయాలని... ఈ సమస్యను అధిగమించేందుకు ఏ చర్యలు తీసుకోబోతున్నారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామని పేర్కొంటూ మహబూబ్‌నగర్ జిల్లా బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరిగిగడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ నెల 6వ తేదీన ఎంవీ ఫౌండేషన్ సహకారంతో హైకోర్టు సీజే, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వేదిక, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదికలకు లేఖలు రాశారు. తమకు వచ్చిన దాదాపు 1,600కు పైగా లేఖలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి వివరాలను ధర్మాసనం ప్రస్తావించింది. కేశవరం గ్రామంలో 5, 6 తరగతులకు చెందిన 180 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉన్నారని, చింతలకుంటలో 5వ తరగతికి చెందిన 166 మంది విద్యార్థులకు టీచరే లేరని, మిట్టదొడ్డిలో 8వ తరగతికి చెందిన 120 మంది విద్యార్థులకు టీచర్ లేరని... ఇలా వివరాలను చదివి వినిపించింది. దీనిపై ఏమంటారని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావును ప్రశ్నించింది. ఇది చాలా కీలక అంశమని, టీచర్ల కొరతను సీరియస్‌గా పరిగణిస్తున్నామని రామచంద్రరావు తెలిపా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఒకరు కాదు.. ఇద్దరు కాదు వందల సంఖ్యలో విద్యార్థులు మాకు లేఖలు రాశారు. మేం చదువుకుంటాం.. ఉపాధ్యాయులను నియమించండి అని అడుగుతున్నారు. దేశ భావితరాలకు ఈ మాత్రం కూడా చేయలేమంటే ఎలా..?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉపాధ్యాయులుగా నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని వారిని సస్పెండ్ చేయాలని.. అలా చేస్తే మిగతా వారు దారికి వస్తారని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మిగిలింది శూన్యం.. గట్టు (మహబూబ్‌నగర్): అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన విద్య అండం లేదు. ఈ పరిస్థితిని వివరిస్తూ గట్టు మండలంలోని చింతలకుంట ప్రాథమిక పాఠశాల (పీఎస్), జెడ్పీ స్కూళ్ల విద్యార్థులు 200 మంది, సిద్దోనిపల్లి తండా పీఎస్ నుంచి 100, బలిగెర పీఎస్ 100, చమన్‌ఖాన్‌దొడ్డి పీఎస్ 100, హిందువాసి పీఎస్ 100, మిత్తదొడ్డి, దళితవాడ పీఎస్‌ల నుంచి 150, గట్టు బాలికల పీఎస్ 50, గొర్లఖాన్‌దొడ్డి పీఎస్ 100, ఆలూరు పీఎస్/జెడ్పీ స్కూళ్ల నుంచి 150, తుమ్మలచెర్వు యూపీఎస్ 100, చాగదోన పీఎస్ 100, బోయలగూడె పీఎస్ నుంచి 150, కొత్తపల్లి పీఎస్ నుంచి 50 మంది, మరికొన్ని స్కూళ్ల నుంచి ఇంకొందరు విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారు. అసలు చింతలకుంట పీఎస్‌లో 330 మంది విద్యార్థులుండగా.. ముగ్గురు టీచర్లు ఉండేవారు. ఇటీవలి బదిలీల్లో ఇద్దరు వెళ్లిపోవడంతో... ఒక్కరే మిగిలారు. చింతలకుంట హైస్కూల్లో 166 మంది విద్యార్థులకు బదిలీల అనంతరం ఒక్కరే మిగిలారు. ఈ స్కూల్లో మూడేళ్లుగా పదో తరగతి విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధిస్తుండడం గమనార్హం. ఇక గట్టు మండలంలోని బల్గెర దళితవాడ, చమన్‌ఖాన్‌దొడ్డి, ఇందువాసి, కొత్తపల్లి, మిట్టదొడ్డి ప్రాథమిక పాఠశాల, దళితవాడ పాఠశాల, గట్టు బాలికల పాఠశాల, సిద్దొనిపల్లెతండా ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకుండా పోయారు. మరో 21 పాఠశాలలు ఒకే టీచర్‌తో కొనసాగుతున్నాయి. ఈ మండలంలో 199 టీచర్ పోస్టులు ఉండగా 76 మంది టీచర్లే ఉన్నారు. 123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మీరు మీ పిల్లలను గానీ, మీ బంధువుల పిల్లలను గానీ చేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారా..?’.. - అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావుకు హైకోర్టు ప్రశ్న.. ‘లేదు..’ - రామచంద్రరావు సమాధానం -
మూతబడి
కామారెడ్డి: జిల్లాలోని సర్కారు బడులలో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడింది. పాఠశాలలలో మౌలిక సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, ఉపాధ్యాయులు ఉన్నచోట కొందరు ‘బెల్లు..బిల్లు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్సులు, చిట్టీల దందాలు, హోటళ్లు, ప్రయివేటు బడులు, ప్రయివేటు కళాశాలలు ఇలా రకరకాల వ్యాపారాలలో మునిగిపోయి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పభుత్వ విద్యపై తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోతున్నారని అంటున్నారు. ఇంగ్లిషు మోజు కూడా పెరుగ డం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరో కార ణం. ఫలితంగా సర్కారు బడులు మూసివేత బాటలో నడుస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలలలో చదివేవారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 3,015 ప్రభు త్వ పాఠశాలలు ఉండగా, అందులో 2,31,500 మంది పిల్లలు చదువుతున్నారు. 835 ప్రయివేటు పాఠశాలల లో 1,95,000 మంది చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో సగటున ఒక్కో పాఠశాలలో 75 మంది చదువుతుంటే, ప్రయివేటు బడులలో సగటు సంఖ్య రెండు వందలకు పైగా ఉంది. ఏటా జిల్లాలో 35 నుంచి 60 వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతబడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలల ఉనికి లేకుండాపోతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేత బాటలో నడుస్తున్నాయి. యేడాదికేడాది విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. మూడేళ్ల వయస్సున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల లో చేర్పించి, నాలుగేళ్లు దాటితే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో చేర్పించాలి. అయితే మూడేళ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు బదులు కాన్వెంటులకు పం పుతున్నారు. తమ పిల్లలు ఇంగ్లిషు రైమ్స్ చెబుతుంటే మురిసిపోయే తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలన్నా, ప్రభుత్వ పాఠశాలలన్నా ఇష్టపడడం లేదు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సొంత వ్యాపకాలలో మునిగి తేలుతున్నారు. కొందరు రోజుల తరబడి బడులకు వె ళ్లకుండానే సంతకాలు చేస్తూ వేతనాలు పొందుతున్నారన్న విమర్శలున్నాయి. దీనికి కొందరు అధికారులు కూడా సహకరిస్తుండడతో విద్యావ్యవస్థ భ్రష్టుప ట్టి ప తోంద ని పలువురు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన ఇంగ్లిషు మోజు ప్రభుత్వ పాఠశాలలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నప్పటికీ, తెలుగు మీడియం చదువులు కావడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇంగ్లిషు మీడియం పై పెరిగిన మోజుతో పిల్లలను ప్రయివేటు బడిబాట పట్టిస్తున్నారు. సర్కారు బడులలో ఉన్న ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించి ఇంగ్లీషు బోధించే ప్రయత్నం చేయడానికి ఇష్టపడడం లేదు. కామారెడ్డి ప్రాంతంలోని ఒకటి రెండు పాఠశాలలలో గ్రామస్థుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లిషు మీడియం మొదలుపెట్టా రు. అక్కడ పిల్లలంతా సర్కారు బడులనే ఆశ్రయిస్తున్నారు. దీనికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ఇలా అందరూ ఉపాధ్యాయులు ఆలోచిస్తే సర్కారు బడులకు పూ ర్వవైభవం తీసుకురావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
కష్టాల చదువు
* సమస్యల వలయంలో గురుకుల, ఆశ్రమ పాఠశాలలు * మూత్రశాలలు.. స్నానాల గదులు కరువు * అర్ధరాత్రయినా... ఆరుబయటకే * బాలికల పాఠశాలలకు ప్రహరీలు లేవు * పట్టిపీడిస్తున్న ఉపాధ్యాయుల కొరత పాలమూరు : ఆర్థిక స్థోమత లేక.. చదువుపై ఉన్న మక్కువతో సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు అక్కడి అరకొర వసతులతో నిత్యం సతమతమవుతున్నారు. జిల్లాలోని పలు ఆశ్రమ, గురుకుల పాఠశాలలు అసౌకర్యాలకు నిలయంగా మారాయి. అక్కడ చేరిన విద్యార్థులకు క్షేమం లేకుండా పోయింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 16 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 6 గిరిజన కులాలు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 4 గురుకుల పాఠశాలలు, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇందులో 16,600 మంది విద్యార్థులు వసతితోపాటు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని పలు ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు కల్పించిన వసతులు, అక్కడి పరిస్థితులైన సాక్షి విలేకరుల బృందం గురువారం ప్రత్యేక విజిట్ నిర్వహించింది. ఇందులో అనేక ఆసక్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాఠశాలల విద్యార్థులు ప్రధానంగా తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల వాటి ప్రాంగణంలో చేతి పంపులు ఉండడంతో అక్కడి విద్యార్థులు ఉప్పునీటిని తాగి కడుపు నింపుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపోను మూత్రశాలలు, స్నానాల గదులు లేక ఆరుబయటకు వెళ్తున్నారు. ఆరుబయట నెలకొల్పిన కొన్ని భవనాలకు ప్రహరీలు లేక వారికి రక్షణ కరువైంది. కొన్నిచోట్ల ముఖ్యమైన సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుల ఖాళీలు ఉండటంతో 9, 10 తరగతుల విద్యార్థులు చదువుల్లో వెనుకబడాల్సి వస్తోంది. ప్రధాన సమస్యలివే.. - వటవర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో నీటివసతి లేక రెండు కిలోమీటర్ల దూరంలో అడవికి సమీపంగా ఉన్న దిగుడు బావి వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. గురువారం ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు వర్కర్లకుగానూ ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండటంతో విధ్యార్థులే వంట చేసుకోవాల్సి వచ్చింది. - బాత్రూములలో వెలుతురు లేదు. రాత్రి సమయంలో చిన్న పిల్లలు ఆరుబయటకు వెళ్లాలంటే భయపడి పాఠశాల ఆవరణలోనే మలమూత్ర విసర్జన చేస్తున్నారు. - బల్మూరు మండలంలోని చెంచుగూడెం బాలిక ఆశ్రమ పాఠశాలలో నాల్గవ తరగతికి చెందిన నవ్వ, నిఖితలు వీవ్ర జ్వరంతో బాధపడుతూ కనిపించారు. ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలల్లో నీటి వసతి సరిపడా లేని కారణంగా విద్యార్థినులు బహిర్భుమికి బయటకు వెళ్లాల్సి వస్తోంది. - పలు బాలికల గురుకుల, ఆశ్రమ పాఠశాలల వద్ద రక్షణ లేకపోవడం, సంబంధిత సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా అమ్మాయిలకు ఆకతాయిల సమస్య ఎదురవుతోంది. -
ఇక అన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు విద్యాశాఖ సర్దుబాటును పూర్తి చేసింది. గత 15 రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియను జిల్లా అధికారులు రెండు రోజుల క్రితం పూర్తి చేశారు. జిల్లాలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 283 మంది ఉపాధ్యాయులు సర్దుబాటు ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు 283 మంది టీచర్లను సర్దుబాటు చేశారు. జిల్లాలో 425 ఉన్నతపాఠశాలలు, 953 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 1501 ప్రాథమి కోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో వెయ్యి వరకు టీచర్ల కొరత ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ టీచర్లను సర్దుబాటు చేసింది. అంతేకాకుండా జిల్లాలో 38 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో టీచర్ ఒక్కరోజు సెలవు పెట్టినా పాఠశాల మూతపడుతోంది. ఇలాంటి పరిస్థితిని రాకుండా ఇక్కడ కూడా టీచర్లను ఇతర ప్రాంతాల నుంచి సర్దుబాటు చేశారు. దీంతో బోధన్ డివిజన్లోని మద్నూరు, జుక్కల్, నిజాంసాగర్, బిచ్కుంద ప్రాంతాలలో టీచర్ల కొరత తీరిపోయింది. ఈ ఏడాది సిలబస్ మారడం, నూతన విధానాలు రావడంతో పాఠశాలలలో విద్యాబోధన సక్రమంగా సాగేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. జిల్లా సమీపంలో ఉన్న పాఠశాలలలో విద్యార్థులు తక్కువగా ఉండి, టీచర్లు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి పాఠశాలలను 40 వరకు గుర్తించారు. ఇక్కడి టీచర్లను కొరత ఉన్న పాఠశాలలకు పంపించారు. ఆయా సబ్జెక్టుకు చెందిన టీచర్లు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కొరత ఉన్న పాఠశాలలకు పంపించారు. కొన్నిచోట్ల సమాచారం నివేదికలు సక్రమంగా లేక పో వడంతో టీచర్ల సర్దుబాటు అనుకున్నంతగా జరుగలేదు. -
ఎన్నాళ్లు ఇలా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరతపై రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని చాలా స్కూళ్లలో టీచర్లు ఉండకపోవడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని పలు ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, దాన్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా రూ.38 కోట్లతో చేపట్టిన 653 అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవడమేమిటనీ ప్రశ్నించారు. మోడల్ స్కూల్ భవనాల నిర్మాణ పనుల జాప్యంపైనా మంత్రి మండిపడ్డారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని మండలాల్లో తాను పర్యటించినప్పుడు ఉపాధ్యాయుల కొరతను గుర్తించానని, దీన్ని సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, సర్వశిక్షాభియాన్ పీఓ కిషన్‌రావు, వయోజన విద్యాసంచాలకులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడిబుడి అడుగులతో..
ఎప్పుడు లేచామో తెలీదు... ఎప్పుడు నిద్రించామో తెలీదు.. నిత్యం టీవీకే అతుక్కుపోవడం, ఆటాపాటలతో కాలక్షేపం చేయ డం.. లేదా బంధువుల ఇళ్లకు వె ళ్లడం.. ఇదీ నిన్నటి వరకు పాఠశాల చిన్నారులు చేసిన పను లు. ఇక నేడు పాఠశాలలు ప్రా రంభమవుతుండడంతో వాటికి స్వస్తి చెప్పాల్సిందే.. ఆదిలాబాద్‌టౌన్ : సెలవులకు సెలవులు వచ్చేశాయ్.. బుధవారంతో హాలీడేస్ ముగిశాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెలన్నరపాటు పుస్తకాలకు స్వస్తి చెప్పిన విద్యార్థులు ఆటాపాటలతో గడిపారు. బంధువుల ఇళ్ల వద్ద సందడి చేశారు. కొండలు, కోనలు, గుట్టలు, ఆటలు, సినిమాలు మావే అని చిచ్చిర పిడుగులు సంతోషంగా గడిపారు. ఇలా గడిపిన వారంతా ఒక్కసారిగా పాఠశాల బాట పడుతున్నారు. మారం చేస్తారేమో...! నిన్నామొన్నటి వరకు జాలీగా తిరిగిన పిల్లలంతా ఒక్కసారిగా స్కూల్‌కు వెళ్లాలంటే మారం చేయడం సర్వసాధారణం. అందుకే తల్లిదండ్రులు వారిని మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిచ్చర పిడుగులంతా సందడికి సెలవు ఇవ్వాల్సిందే. ఇక బారెడు పొద్దెక్కేదాక నిద్రపోవడాలూ ఉండవు, అర్ధరాత్రి దాకా టీ‘వీక్షణాలూ’ ఉండవు. ఒక్కసారిగా టైమ్ టేబుల్ మారిపోతుంది. మరి చిన్నారులు వెంటనే ఈ మార్పుకు సై అనగలరా? 40 రోజులకు పైగా మూలన పడేసిన క్రమశిక్షణను అర్జంటుగా అలవరచుకోగలరా? కొంత ఇబ్బంది సర్వసాధారణమే. ఇప్పటివరకు తాము కోరుకున్న స్వేచ్ఛను అనుభవించిన తమను ఒకేసారి తరగతి గది అనే పంజరంలోకి పంపిస్తున్నారనే భావనతో ఉన్న చిన్నారులకు మైండ్‘సెట్’ను ట్యూన్ చేయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాగతం పలకనున్న సమస్యలు.. సరదాగా వేసవి సెలవులు పూర్తిచేసిన విద్యార్థులకు పాఠశాలలు మొదటి రోజే సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ఉపాధ్యాయుల కొరత, చెట్ల కింద చదువులు, మరుగుదొడ్ల లేమి, తదితర సమస్యలు తప్పేలా లేవు. పాఠశాల మొదటి రోజే దుస్తులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇంకా పాఠశాలలకు చేరుకోలేదు. పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదు. పాలకులు, అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని పదేపదే హామీ ఇస్తున్నా నెరవేరడం లేదు. దీంతో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఉపాధ్యాయుల కొరత, తదితర సమస్యలతో పదో తరగతి ఫలితాలు పడిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలోనైనా పదో తరగతి ఫలితాలు టాప్ 10గా ఉంటాయని ఆశిద్దాం. -
తీరు మారని సర్కారు బడి
12న పాఠశాలలు పునః ప్రారంభం ఈసారీ తప్పని చెట్ల కింద చదువులు! చాలా చోట్ల ఏకోపాధ్యాయులే మెరుగు పడని మౌలిక వసతులు మరుగుదొడ్లు లేని స్కూల్లెన్నో.. మరో నాలుగు రోజుల్లో బడులు పునఃప్రారంభం కానున్నాయి. అయితే కొత్త తరగతిలోకి కొత్త ఉత్సాహంతో వెళ్తున్న విద్యార్థులకు పాత సమస్యలే స్వాగతం పలుకనున్నాయి. పైకప్పు లేని గదులు, గదుల కొరతతో చెట్ల కిందే చదువుకున్న అనుభవం మరోసారి ఎదురుకానుంది. ఉపాధ్యాయుల కొరత, మరుగు దొడ్లు, మూత్ర శాలలు లేని పాఠశాలలు ఎన్నో.. ఇలా ప్రభుత్వ పాఠశాలలు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి ఇదీ సక్సెస్ స్కూలు వర్ని మండల కేంద్రం వడ్డేపల్లిలోని సక్సెస్ స్కూలు ఇది. 45 ఏళ్లపాటు రేకుల షెడ్డు, మరో నాలుగు గదుల్లో హైస్కూల్ కొనసాగింది. 25 ఏళ్లలో మంజూరైంది ఒకే ఒక్క తరగతి గది. ఇటీవలే దీనిని సక్సెస్ స్కూలుగా మార్చారు. ఈ రేకుల షెడ్డు కిందే ‘సక్సెస్’ విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది :మౌలిక వసతుల కల్పనలో పాలకులు, అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి పిల్లలు అసౌకర్యాల మధ్యనే విద్యాభ్యాసం చేయాల్సి వస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాల లు, 478 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఇందులో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులున్నారు. 10 వే ల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కానీ చాలా పాఠశాలల్లో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. 462 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. 164 పాఠశాలలకు అదనపు గదులు అవసరమున్నాయి. 612 పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. 152 పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేదు. సరిపోయేన్ని తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు చెట్ల కిందే చదువుకోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకే గదిలో రెండు మూడు తరగతులనూ నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా జుక్కల్ మండలంలోని 14 పాఠశాలల్లో ఒక్కో టీచరే ఉన్నారు. డిచ్పల్లి మండలంలోని ఆరు తం డాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో, కామారెడ్డి డివిజన్లోని 33 ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. ఆయా పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణానికి రెండు విడతల్లో నిధులు మంజూరైనా.. గదుల నిర్మా ణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. 133 తండాల్లో గదులు లేక చెట్ల కింద, ఒకే తరగతి గదిలో విద్యాబోధన కొనసాగుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. కొన్ని చోట్ల తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గదుల రేకులు విరిగి పోయాయి. గదు లు కూలిపోయాయి. జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల పాఠశాల, వినాయక్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాల, దుబ్బ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలల్లో రేకులు విరిగిపోయాయి. పట్టించుకోని అధికారులు పాఠశాలలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అధికారులు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. మరోవైపు రాజీవ్ విద్యామిషన్ నుంచి కోట్లాది రూపాయలు మంజూరవుతున్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అవసరం లేని చోట అదనపు గదులు నిర్మించిన దాఖలాలున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో నాలుగు పాఠశాలల్లో కలిపి 22 మంది విద్యార్థులే ఉన్నారు. కానీ అవసరం లేకున్నా ఆ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో, తండాల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నా.. ఆయా పాఠశాలలకు తరగతి గదులు మంజూరు చేయడం లేదు. -
సాగని సర్కారీ చదువులు
బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ఎక్కడికక్కడ పాఠ్యాంశాలు పేరుకుపోతుండడం.. సిలబస్ ఓ పట్టాన పూర్తి కాకపోవడం వంటి సమస్యలకు కారణం ఉపాధ్యాయుల కొరతే. అందుకే ప్రభుత్వం ఎడ్యకేషన్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను తెరపైకి తెచ్చింది. ఉపాధ్యాయుల కొరత వెంటనే అధిగమించాలని నానా హడావుడి చేసింది. గత నవంబర్‌లో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మొత్తం 56 మండలాల్లో 526 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు సంబర పడ్డారు. బీఈడీ, డీఈడీ పట్టభద్రులతో పాటు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎంఈఓ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు చేపట్టినా.. ఈ సారి నిబంధనలు మార్చామని.. అందరికీ ఒంగోలులో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎంఈఓలు దరఖాస్తులను ఒంగోలు రాజీవ్ విద్యా మిషన్‌కు పంపారు. అంతే.. కథ అక్కడితో ఆగింది. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. విద్యా సంవత్సరం కూడా ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. విద్య లక్ష్యం నెరవేరేదెలా? పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మధ్యాహ్నభోజనం పథకం అమలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, సూక్ష్మ ప్రణాళిక నివేదికలు, ఎస్ఎంసీ సమావేశాలు, డైస్ వివరాలు, హెచ్ఎం సమావేశాలకు ఉన్న ఒక్క ఉపాధ్యాయుడే హాజరు కావాలి. అలాగే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఆయన మాత్రమే బోధించాలి. ఇలాంటి పరిస్థితుల మధ్య సిలబస్ కొండలా పేరుకుపోతోంది. పిల్లల గ్రేడ్లు పడిపోతున్నాయి. దీనికి తోడు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పాఠశాలలు సజావుగా సాగకపోవడంతో పాఠాలు చెట్లెక్కాయి. ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులున్న చోట కూడా బోధన సజావుగా సాగిన దాఖలాలు లేవు. ఎవరైనా సెలవు పెడితే.. ఆ భారమంతా మిగిలిన ఉపాధ్యాయులే చూసుకోవాలి. అది జరిగే పని కాకపోవడంతో.. ఇలాంటి పాఠశాలల్లో కూడా బోధన కుంటుపడుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కచ్చితంగా భర్తీ చేయాల్సిన ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు భ ర్తీ కాకుండా నిలిచిపోయినా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దివాలాకోరుతనానికి నిదర్శనం. -
సర్కార్ చదువులు డీలా
సాక్షి, సంగారెడ్డి: సర్కార్ బడుల్లో చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉపాధ్యాయులు లేకుండానే ఆరు నెలలుగా పాఠశాలలను నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీ ప్రకటన వెలువడుతుందని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినా ఇప్పటివరకు అతీగతి లేకుండా పోయింది. డీఎస్సీ, టెట్‌ను వేర్వేరుగా నిర్వహించాలా?, సంయుక్తంగా నిర్వహించాలా? అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చకపోవడంతో ఐదు నెలలుగా నోటిఫికేషన్‌కు నోచుకోవడం లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. ఓవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు విద్యా వలంటీర్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు అరకొర చదువులు సాగిస్తున్నారు. పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆటపాటలతో కాలం గడుపుతున్నారు. 926 పోస్టుల కోసం ప్రతిపాదనలు.. జిల్లాలో మొత్తం 926 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ విద్యాశాఖ అధికారులు డీఎస్సీ కోసం ప్రతిపాదనలు పంపారు. నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతోండడంతో జిల్లాలో వంద మంది ప్రత్యేక విద్యా వలంటీర్లను నియమించుకోడానికి అనుమతించాలని కలెక్టర్ నెల రోజుల క్రితం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వలంటీర్ల నియామకం కూడా నిలిచిపోయింది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్న బడులకు ఇతర పాఠశాలల నుంచి 117 మంది ఉపాధ్యాయులను పంపించి తాత్కాలికంగా సర్దుబాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు రెండో రోజుల క్రితం కలెక్టర్ అనుమతి కోరారు. టెన్త్ ఫలితాలపై ప్రభావం పదోతరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. డిసెంబర్ నెలాఖరులోగా సిలబస్ పూర్తి చేయాల్సి ఉన్నా ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. ఈ సారి ఉపాధ్యాయుల కొరత టెన్త్ ఫలితాలను మరింత దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. దయనీయంగా ఉర్దూ బడులు జిల్లాలో 729 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడూ సెలవు తీసుకుంటే ఆ పాఠశాలలు సైతం మూతబడుతున్నాయి. ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పాఠశాలలు 76 ఉన్నాయి. అందులో ఉర్దూ మీడియం బడులే 46 ఉన్నాయి. ఉర్దూ మాధ్యమం బడులు మరీ దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఈ మాధ్యమంలోని ప్రాథమిక పాఠశాలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. 2010-11లో 158 ఉన్న ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలల సంఖ్య 2011-12లో 154కు తగ్గిపోగా 2012-13లో 149కు పడిపోయింది.