నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు విద్యాశాఖ సర్దుబాటును పూర్తి చేసింది. గత 15 రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియను జిల్లా అధికారులు రెండు రోజుల క్రితం పూర్తి చేశారు. జిల్లాలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
283 మంది ఉపాధ్యాయులు సర్దుబాటు
ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు 283 మంది టీచర్లను సర్దుబాటు చేశారు. జిల్లాలో 425 ఉన్నతపాఠశాలలు, 953 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 1501 ప్రాథమి కోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో వెయ్యి వరకు టీచర్ల కొరత ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ టీచర్లను సర్దుబాటు చేసింది. అంతేకాకుండా జిల్లాలో 38 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.
ఇందులో టీచర్ ఒక్కరోజు సెలవు పెట్టినా పాఠశాల మూతపడుతోంది. ఇలాంటి పరిస్థితిని రాకుండా ఇక్కడ కూడా టీచర్లను ఇతర ప్రాంతాల నుంచి సర్దుబాటు చేశారు. దీంతో బోధన్ డివిజన్‌లోని మద్నూరు, జుక్కల్, నిజాంసాగర్, బిచ్కుంద ప్రాంతాలలో టీచర్ల కొరత తీరిపోయింది. ఈ ఏడాది సిలబస్ మారడం, నూతన విధానాలు రావడంతో పాఠశాలలలో విద్యాబోధన సక్రమంగా సాగేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. జిల్లా సమీపంలో ఉన్న పాఠశాలలలో విద్యార్థులు తక్కువగా ఉండి, టీచర్లు ఎక్కువగా ఉన్నారు.
ఇలాంటి పాఠశాలలను 40 వరకు గుర్తించారు. ఇక్కడి టీచర్లను కొరత ఉన్న పాఠశాలలకు పంపించారు. ఆయా సబ్జెక్టుకు చెందిన టీచర్లు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కొరత ఉన్న పాఠశాలలకు పంపించారు. కొన్నిచోట్ల సమాచారం నివేదికలు సక్రమంగా లేక పో వడంతో టీచర్ల సర్దుబాటు అనుకున్నంతగా జరుగలేదు.
ఇక అన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులు
Published Sun, Jul 13 2014 4:33 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement