ఏపీ గ్రామీణ ప్రగతి బ్యాంకులో చోరీ | Robbery in AP Grameena pragathi bank | Sakshi
Sakshi News home page

ఏపీ గ్రామీణ ప్రగతి బ్యాంకులో చోరీ

Published Fri, May 13 2016 9:34 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

Robbery in AP Grameena pragathi bank

కర్నూలు : కర్నూలు జిల్లా ఆలూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రగతి బ్యాంకులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు బ్యాంకులోకి ప్రవేశించి నగదు దోచుకున్నారు. అనంతరం బ్యాంకులోని రెండు బీరువాలను ధ్వంసం చేశారు. అలాగే లోపల సీసీ కెమెరాలను కూడా పగలగొట్టారు. అనంతరం వారు పరారైయ్యారు.

బ్యాంకు చోరీని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బ్యాంకులో ఎంత నగదు దొంగిలించారనే విషయం తెలియవలసి ఉందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement