
సాక్షి, కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. వీరిని కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 21 మంది ఉన్నట్టుగా సమాచారం.
వైఎస్ జగన్ సంతాపం
పెద్దహోతూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment