ఇద్దరు విద్యార్ధుల మధ్య జరిగిన వివాదం చివరికి రాళ్లదాడికి దారితీసింది. కర్నూలు జిల్లా ఆలూరులోని గురుకుల కళాశాలలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ జూనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
ఆలూరు: ఇద్దరు విద్యార్ధుల మధ్య జరిగిన వివాదం చివరికి రాళ్లదాడికి దారితీసింది. కర్నూలు జిల్లా ఆలూరులోని గురుకుల కళాశాలలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ జూనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర(16).. అదే కళాశాలకు చెందిన ద్వితియ సంవత్సరం విద్యార్ధితో గొడవపడ్డాడు. దీంతో సీనియర్లందరూ ఏకమై రాఘవేంద్రను రాళ్లతో కొట్టారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కళాశాలల లో అధ్యాపకులు లేకపోవడంవల్లే గొడవ ఇంత పెద్దదైనట్లు తెలుస్తోంది.