Stones thrown
-
అడ్డుకున్నారని పోలీసులపై రాళ్ల దాడి
న్యూఢిల్లీ : ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురుగ్రామ్‌లోని ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులపై ఢిల్లీ రూరల్ ప్రాంతానికి చెందిన సల్హాపూర్ వాసులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హరియాణా ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ప్రకటించించడంతో పలు పరిశ్రమలు బుధవారం పున:ప్రారంభమయ్యాయి. దీంతో వందల సంఖ్యలో ప్రజలు గురుగ్రామ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గురుగ్రామ్ పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు వారిపై రాళ్ల దాడికి దిగారు.(చదవండి : ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలను అనుమతించం..) పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, గురుగ్రామ్‌లో ఇప్పటివరకు 220 కరోనా కేసులు నమోదు కాగా, అందులో ఎక్కువ మంది ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీతో సరిహద్దును మూసివేయాలని గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. (చదవండి : భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!) -
జూనియర్ విద్యార్థిపై సీనియర్ల రాళ్ల దాడి
ఆలూరు: ఇద్దరు విద్యార్ధుల మధ్య జరిగిన వివాదం చివరికి రాళ్లదాడికి దారితీసింది. కర్నూలు జిల్లా ఆలూరులోని గురుకుల కళాశాలలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ జూనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర(16).. అదే కళాశాలకు చెందిన ద్వితియ సంవత్సరం విద్యార్ధితో గొడవపడ్డాడు. దీంతో సీనియర్లందరూ ఏకమై రాఘవేంద్రను రాళ్లతో కొట్టారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కళాశాలల లో అధ్యాపకులు లేకపోవడంవల్లే గొడవ ఇంత పెద్దదైనట్లు తెలుస్తోంది. -
రైలుపై రాళ్లు, ప్రయాణికులకు గాయాలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల రైల్వే స్టేషన్లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు గాయపడ్డారు. రైలు సిగ్నల్ కోసం స్టేషన్లో గంట సేపు వేచి ఉంది. ఈ సమయంలో రాళ్లు రువ్వడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం గూంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. -
కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : ఎన్నికల ప్రచారం విషయంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పలు జిల్లాల్లో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటనాయినిపల్లెలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు గాయపడగా, ఒక స్కార్పియో వాహనం ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నల్లగొండ జిల్లాలోనూ ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారితీసింది. చందంపేట మండలం కంబంపల్లి గ్రామంలో టిడిపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ప్రచారం చేసుకుంటూ వస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరికి ఒకరు ఎదురుపడటంతో పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలు రాళ్లురువ్వుకున్నారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలం అనంతపురంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్త జమీల్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు గొడ్డలితో దాడి చేశారు. దాంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
చిరంజీవిపై రాళ్లువిసిరిన సమైక్యవాదులు
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి చిరంజీవి ఏమంటా వరద ముంపు ప్రాంతాలలో పర్యటన మొదలు పెట్టారో అడుగడుగునా ఆందోళనలు, అటంకాలే ఎదురవుతున్నాయి. విశాఖ జిల్లా యలమంచిలిలో నిన్న వరద బాధితులు చిరంజీవి తమ వద్దకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో నాటుపడవ ఎక్కబోతూ కాలుజారి నీటిలో పడ్డారు. ఈరోజు రాజాంలో సమైక్యవాదులు అతనిపై రాళ్లు విసిరారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన చిరంజీవి కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారితోపాటు సమైక్యవాదులు కూడా రాళ్లు విసిరారు. పదవి వదులుకున్న తరువాతే పర్యటనకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. నిన్న ఉదయం చిరంజీవి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మీదగా వెళ్లారు. ఇక్కడ వరదకు గురైన ప్రాంతాలను చూడలేదు. బాధితులనూ పలకరించలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి యలమంచిలి వస్తున్నట్లు చెప్పడంతో బాధితులు ఆయన కోసం ఎదురు చూశారు. దాదాపు మూడు గంటలపాటు ఆయన కోసం వేచి ఉన్నారు. కానీ ఆయన యలమంచిలి పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డున వెళ్లిపోయారు. దాంతో స్థానిక వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆ తరువాత కాకినాడ సమీపంలోని తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించే సమయంలో పడవ ఎక్కబోయి కాలుజారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకొని లేపారు. ఈ విధంగా ఆయన వెళ్లిన ప్రతిచోట ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది.