న్యూఢిల్లీ : ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురుగ్రామ్‌లోని ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులపై ఢిల్లీ రూరల్ ప్రాంతానికి చెందిన సల్హాపూర్ వాసులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హరియాణా ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించించడంతో పలు పరిశ్రమలు బుధవారం పున:ప్రారంభమయ్యాయి. దీంతో వందల సంఖ్యలో ప్రజలు గురుగ్రామ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గురుగ్రామ్ పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు వారిపై రాళ్ల దాడికి దిగారు.(చదవండి : ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలను అనుమతించం..)
పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, గురుగ్రామ్‌లో ఇప్పటివరకు 220 కరోనా కేసులు నమోదు కాగా, అందులో ఎక్కువ మంది ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీతో సరిహద్దును మూసివేయాలని గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. (చదవండి : భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!)
Comments
Please login to add a commentAdd a comment