ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్(పాత చిత్రం)
కర్నూలు జిల్లా : ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు వైకుంఠ మళ్లికార్జున్, గోపి ఆరోపణలు గుప్పించారు. నీరు-చెట్టు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీంలో ఒక్క ఇంటికి రూ.15 వేలు వసూలు చేశారని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్ల ఉద్యోగానికి ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇంచార్జి వీరభద్రగౌడ్ అవినీతిపై విచారణ చేయాలని టీడీపీ నాయకులు మళ్లికార్జున్, గోపి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment