differences between TDP leaders
-
విభేదాలతో సై’కిల్’.. టీడీపీలో కుంపట్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కుంపట్ల కుమ్ములాటలతో ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ డీలా పడింది. అత్యవసర చికిత్స చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలు వికటించి, పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. 2019 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన వరుస పరాజయాలతో టీడీపీలో నిస్తేజం నెలకొంది. ఇటీవల మహానాడు నిర్వహించి పార్టీలో ఉత్తేజం నింపాలన్న చంద్రబాబు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి! వైఎస్సార్ సీపీ ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా నీరుగారిపోయాయి. పార్టీ ఇన్చార్జులుగా ఉండేందుకు చాలా నియోజకవర్గాల్లో నాయకులు ముందుకురావటం లేదు. పార్టీలో పెద్ద నాయకులు అనుకుంటున్న వారు కుటుంబ కలహాలతో క్యాడర్లో పట్టుకోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల నాయకులు చంద్రబాబు, లోకేష్ వర్గాలుగా చీలి పరస్పరం కత్తులు దూసుకొంటున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పరిస్థితిని చూసి టీడీపీ క్యాడర్ డీలాపడింది. గుడివాడలో తమ్ముళ్ల తన్నులాట గుడివాడలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరావు, పిన్నమనేని బాబ్జి, శిష్ట్లా లోహిత్‌లో ఎవరికీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీకొనే సత్తాలేదని ఇప్పటికే స్పష్టమైంది. వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలి నానికి పోటీ ఇచ్చే నేత కోసం చంద్రబాబు జల్లెడపడుతున్నా ఫలితం లేదు. గుడివాడలో మినీ మహానాడు నిర్వహిస్తామని ఘనంగా ప్రకటించిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో చేతులు ఎత్తేశారు. గన్నవరంలో నేతలు కరువు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకొనే నాథుడే లేడు. గన్నవరం వెళ్లాల్సిందిగా బయటి నియోజకవర్గాల నేతలను చంద్రబాబు ప్రాథేయ పడటం అక్కడ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. తిరువూరులో ఆధిపత్య పోరు తిరువూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, మాజీ మంత్రి జవహర్, కొత్తగా నియమితులైన నియోజకవర్గ ఇన్చార్జి సేవల దేవదత్తు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కొత్త ఇన్చార్జికి నాయకులతో సఖ్యతలేదని, రాజకీయ అనుభవం శూన్యమని పార్టీలోని ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు. జగ్గయ్యపేటలో కనిపించని సఖ్యత జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురాం, శ్రీరాం తాతయ్య, టీడీ జనార్దన్ వర్గాల మధ్య సఖ్యత లేదు. దీంతో అక్కడ టీడీపీకి సంబంధించిన ముఖ్య సామాజిక వర్గం వారికే టికెట్టు ఇచ్చేలా పెద్దలు పావులు కదపడంతో గందరగోళం నెలకొంది. పశ్చిమ నియోజకవర్గంలో వర్గపోరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు నెలకొంది. లోకేష్ పేరుతో బుద్దా వెంకన్న పెత్తనం చేయాలని చూస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ కేశినేని నానిని అధినేత చంద్రబాబు ముందే అవమానించిన వెంకన్నను అధిష్టానం వెనకేసుకు రావడాన్ని ఆయన గొప్పగా చెప్పుకొంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను చెప్పిన వ్యక్తికే టికెట్ ఇస్తానంటేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చంద్రబాబుకు ఎంపీ కేశినేని తేలి్చచెప్పినట్లు తెలుస్తోంది. బుద్దా వెంకన్నను దూరంగా ఉంచాలని షరతు పెట్టారట. కానీ లోకేష్ ససేమిరా అనడంతో చంద్రబాబు నిస్సహాయంగా ఉండిపోయారు. దీంతో అలిగిన కేశినేని నాని మహానాడుకు కూడా హాజరు కాలేదు. బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్న ఆయన ఎన్నికలకు ముందు టీడీపీకి ఝులక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్న చర్చ కార్యకర్తల్లో ఉంది. తనకు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అలకబూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సొంతింట్లోనే కుంపటి.. కేశినేని నాని షరతులను పట్టించుకోని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేసి, అతని తమ్ముడిని ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి టికెట్ ఇవ్వనని, అతడి తమ్ముడికి ఇస్తానని విజయవాడలోని పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన కేశినేని నాని సైతం తన సన్నిహితులతో వరుసగా మంతనాలు జరుపుతున్నారు. అందరినీ కూడబెట్టుకొని ఒక్క సారిగా షాక్ ఇవ్వాలనేది ఆయన వ్యూహంగా భావిస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న టీడీపీ దీపం కొడిగట్టడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ప్రెస్మీట్లు పెట్టే పేపరు పులులే టీడీపీలో మిగులుతారని పార్టీ కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విజయ వాడ సెంట్రల్, మైలవరం నియోజక వర్గాల్లోనూ అంతకు మించిన పితలాటకాలే ఉన్నాయి. ఈస్ట్‌లో ‘గద్దె’కు ఎసరు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పరిస్థితి పైకి కనిపిస్తున్నంత బలంగా లేదు. గద్దె సీటుపై పలువురు టీడీపీ నేతలు కన్నేశారు. లోకేష్ అండదండలతో కొందరు ఎన్ఆర్ఐలు ఈ నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండటంపై గద్దె కుటుంబం గుర్రుగా ఉంది. అవసరమైతే గద్దెను ఎంపీ అభ్యర్థిగా పంపించి, ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఓ ఎన్ఆర్ఐకి అధిష్టానం మాట ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గద్దె తీవ్ర మనస్తాపం చెంది, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనివార్యమైతే ఎంపీ కేశినేని నానితో జట్టు కట్టి వేరే పార్టీకి మారాలన్నది ఆయన ఆలోచనగా టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. పెనమలూరులో త్రిముఖ పోరు పెనమలూరు నియోజకవర్గంలో బోడె ప్రసాద్, యలమంచిలి బాబురాజేంద్ర ప్రసాద్, దేవినేని గౌతం (పండు) వర్గాల ఆధిపత్య పోరుతో టీడీపీ కునారిల్లుతోంది. లోకేష్ ఆశీస్సులతో పండు వర్గం పెత్తనం చెలాయిస్తోంది. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ, పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోడంతో నాయకత్వంపై క్యాడర్ విశ్వాసం కోల్పోయింది. -
పార్టీని నాశనం చేసిందెవరో?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో వర్గవిభేదాలు షరామామూలుగా మారాయి. వేదికలు మాత్రమే మారుతున్నాయి. ప్రతి వేదికపై ఒక వర్గం మరో వర్గంపై పైచేయి సాధించుకునే క్రమంలో ఘాటు విమర్శలకు దిగుతోంది. తాజాగా నెలన్నరగా అధికారపార్టీలో ఆత్మకూరు పంచాయితీ ముగింపు లేని రీతిలో కొనసాగుతోంది. జిల్లా టీడీపీలో ఉన్న గ్రూప్‌లన్నీ ఆత్మకూరులో ఉండడం, ప్రతి ఒక్కరూ అక్కడివారు కావడంతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సంగం మండలంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి మంత్రి సోమిరెడ్డి వర్గం పూర్తిగా గైర్హాజరైంది. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేయడం పార్టీలో మళ్లీ చర్చనీయాంశం అయింది. సోమవారం సంగం, ఆత్మకూరు మండలాల్లో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డి సమావేశాలు నిర్వహించారు. దీనికి యథావిధిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరుడు, పార్టీ నేత కన్నబాబు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితంగా ఉండే డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక కొత్తగా రంగంలోకి రావాలనుకుంటున్న బొల్లినేని కృష్ణయ్య ప్రతినిధిగా అతని సమీప బంధువు తాళ్లూరి గిరినాయుడు హాజరయ్యారు. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి పేరు చెప్పకుండా ఆయనపై ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తనని 2004 ఎన్నికల సమాయానికి పార్టీ నుంచి బయటకు పంపేశారని, మళ్లీ గత కొంతకాలంగా తనపై పార్టీలోని ఆయన సొంత మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. వీళ్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. వాళ్లకి మంత్రి పదవి రావాలే తప్ప జిల్లాలో పార్టీ బాగుండాలని ఏమాత్రం లేదని, గోదావరి జిల్లాలో గెలిస్తే అధికారం వస్తుందనుకుంటున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేకుండా చేసిన పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మరోవైపు ఆదాల వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. -
ఆలూరు టీడీపీలో బయటపడ్డ విభేదాలు
కర్నూలు జిల్లా : ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు వైకుంఠ మళ్లికార్జున్, గోపి ఆరోపణలు గుప్పించారు. నీరు-చెట్టు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీంలో ఒక్క ఇంటికి రూ.15 వేలు వసూలు చేశారని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్ల ఉద్యోగానికి ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇంచార్జి వీరభద్రగౌడ్ అవినీతిపై విచారణ చేయాలని టీడీపీ నాయకులు మళ్లికార్జున్, గోపి డిమాండ్ చేశారు. -
చంద్రబాబు వద్దకు టీడీపీ పంచాయితీ!
-
చంద్రబాబు వద్దకు టీడీపీ పంచాయితీ!
విజయవాడ: బెజవాడలో ఆధిపత్య పోరుపై చిచ్చు మరింత రాజుకుంది. నగరంలో టీడీపీ నేతల మధ్య చాపకింద నీరులా మారిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆధిపత్య పంచాయితీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెంతకు చేరింది. కేశినేని నాని నిన్నటి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ కావడంతో బాబును కలిసేందుకు నాని నిశ్చయించుకున్నారు. కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని బాబు వద్దకు తీసుకువెళ్లాలనే యోచనలో నాని ఉన్నారు. గత ఆరు నెలల్లో ఉమ వ్యవహారశైలికి సంబంధించి బాబుకు నాని ఫిర్యాదు చేయనున్నారు. శుక్రవారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య చాప కింద నీరులా పాకుతున్నవిభేదాలు బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. ఆటోనగర్‌లో జరిగిన సీవరేజి ప్లాంటు ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘జిల్లా మంత్రిగారికి చెబుతున్నా.. మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదరదు’’ అంటూ ఉమాపై ఆయన సమక్షంలోనే ఘాటుగా స్పందించారు. మరో మంత్రి నారాయణ కూడా వేదికపైనే ఉండగానే నాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత కొన్నేళ్లుగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. జిల్లా పార్టీని గుప్పిట్లో ఉంచుకోవడానికి మంత్రి ప్రయత్నిస్తడం కాస్తా టీడీపీలో విభేదాలకు తావిచ్చింది. -
టీడీపీలో ఆధిపత్య పోరు
-
బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరు
మంత్రి దేవినేని ఉమాపై ఎంపీ కేశినేని నాని బహిరంగ విమర్శలు చాప కింద నీరులా కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు ఎంపీ, ఎమ్మెల్యేలను అధికారుల బేఖాతరు.. ఫోన్ చేసినా పలకని వైనం సాక్షి, విజయవాడ బ్యూరో: బెజవాడ టీడీపీ లో చిచ్చు రగులుకుంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య చాప కింద నీరులా పాకుతున్న విభేదాలు శుక్రవారం బహిర్గతమయ్యాయి. ఆటోనగర్‌లో జరిగిన సీవరేజి ప్లాంటు ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘జిల్లా మంత్రిగారికి చెబుతున్నా.. మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదరదు’’ అంటూ ఉమాపై ఆయన సమక్షంలోనే ఘాటుగా స్పందించారు.అప్పుడు మరో మంత్రి నారాయణ కూడా వేదికపైనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. జిల్లా పార్టీని గుప్పిట్లో ఉంచుకోవడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కేశినేని నానికి లోక్‌సభ టికెట్ రాకుండా ఉమా యత్నించారు. దీంతో చంద్రబాబు కూడా పునరాలోచలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నాని అధినేతతో పోరాడి మరీ టికెట్ సాధించుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా నుంచి ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలకు మంత్రి పదవులు లభించాయి. అప్పటి నుంచి జిల్లా పార్టీపై, అధికార యంత్రాంగంపై మరింత పట్టు సాధిం చేందుకు ఉమా యత్నిస్తున్నారు. జిల్లా నుంచి మరో సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే తన అధికారానికి గండి పడుతుందని తొలిసారి ఎమ్మెల్యే అయిన కొల్లు రవీంద్రకు కేబినెట్లో చోటు దక్కేలా పావులు కదిపారు. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, వంశీ, మండలి బుద్ధప్రసాద్‌లు ఉమాకు దూరంగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే గద్దే రాంమోహన్‌రావు సైతం అలానే ఉంటున్నారు. విజయవాడ నగరానికి సంబంధించిన అధికారిక, పార్టీ వ్యవహారాల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అధికారులూ ఎంపీ, ఎమ్మెల్యేలను ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ నాని శుక్రవారం అధికారిక కార్యక్రమంలోనే ఉమా మీద, అధికారుల మీద ధ్వజమెత్తారు. అధికారులు తీసుకుంటున్న బఫూన్ చర్యలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు కశ్మీర్లో కూడా లేని ఆంక్షలు విజయవాడలో అమలు చేస్తూ, నగరానికి చెడ్డ పేరు తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలన్నీ సీఎం చంద్రబాబుదృష్టికి వెళ్లాలనే తాను బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఎంపీ నాని చెప్పారు.