
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ జనసమితి (టీజేఎస్)తో కలసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆహ్వానం మేరకు వెంకట్‌రెడ్డితోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు మంగళవారం ఆ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతున్న తరుణంలో సమస్యల పరిష్కారం, ఉద్యమ ఆకాంక్షల సాధనకు కలసి పనిచేస్తామని కోదండరాం అన్నారు.