సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సొమ్ముతో సభలు పెట్టి ఎన్నికల సవాల్ విసురుతున్నారని, ముందుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించినపుడే సవాల్ చేయడానికి అర్హత ఉంటుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్(మొన్కొంబు సాంబశివన్) స్వామినాథన్ కమీషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో ఉపన్యాసాలు దంచుతున్నారని అన్నారు. ప్రభుత్వ డబ్బుతో సభలు పెట్టి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని, అవి నవ నిర్మాణ దీక్షలు కావని ఎన్నికల సభలని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకరించకుంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలను కలుపుకుని పోరాటం చేయాలని సూచించారు.
మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తోంది.. చాడ వెంకట్ రెడ్డి
కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా సేవ్ కానిస్టిట్యూషన్, సేవ్ ది నేషన్ పేరుతో ప్రచార జాతరలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment