ఆ హామీ ఏమైంది: చాడ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో నల్లధనాన్ని స్వదేశానికి తీసుకు రాకుండా అవినీతిపై యుద్ధం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం పట్ల సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి దేశంలోని ప్రతికుటుంబం ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
నల్లధనాన్ని తీసుకురావడంలో మోదీ విఫలమయ్యారన్నారు. కేంద్రం, ఆర్‌బీఐ ఇప్పటివరకు బ్యాంకులకు ఎంత డబ్బు పంపించారో కూడా చెప్పలేక పోతున్నా యని విమర్శించారు.