వరంగల్: నోట్ట రద్దుతో ప్రజానీకం తీవ్ర ఇక్కట్లు పడుతుంటే.. ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని మోదీ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. పెద్ద నోట్ట రద్దుతో కేసీఆర్ ఖంగుతున్నారు.. అందకే ప్రధాని మోదీ ప్రసన్నం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవ చేశారు. వరంగల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.
తెలంగాణలో పాలన గాడి తప్పిందని.. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక.. సంక్షేమ పథకాల అమలు జరగక పరువుపోయే పరిస్థి నెలకొందని చాడ అన్నారు. కార్పోరేట్ శక్తుల ఆస్తులపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వచ్చే కరెన్సీపై ఆర్బీఐ పక్షపాతం వహిస్తోందని, కార్పొరేట్ బ్యాంకులకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. ఏపీకి రూ. 4 వేల కోట్ల కొత్త కరెన్సీ ఇస్తుంటే తెలంగాణకు కూడా ఇవ్వమని అడిగే దమ్ము కేసీఆర్‌కు లేదని విమర్శించారు.
నోట్ల రద్దుపై మోదీది అసత్య ప్రచారం: చాడ
Published Sun, Nov 27 2016 2:08 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement
Advertisement