బాబు కమిటీ బ్రెయిన్లెస్ కమిటీ! | cpi narayana slams pm modi over currency demonetization problems | Sakshi
Sakshi News home page

బాబు కమిటీ బ్రెయిన్లెస్ కమిటీ!

Published Fri, Dec 2 2016 12:41 PM | Last Updated on Sat, Sep 22 2018 7:57 PM

బాబు కమిటీ బ్రెయిన్లెస్ కమిటీ! - Sakshi

బాబు కమిటీ బ్రెయిన్లెస్ కమిటీ!

గుంటూరు : పెద్ద నోట్ల రద్దుపై అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ బ్రెయిన్లెస్ కమిటీ అని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప‍్రధాని మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మనీ నియంత హిట్లర్ కూడా కరెన్సీని అవమానించలేదని కానీ, ప్రధాని మోదీ ఓ శాడిస్టులా దేశ ప్రజల మీద సర్జికల్ దాడులు చేస్తున్నాడన్నారు. హిట్లర్ నేరుగా ప్రజలను చంపితే మోదీ ప్రజలను మానసికంగా చంపుతున్నాడని ఆయన అన్నారు. హిట్లర్ ఆత్మహత్య చేసుకుంటే మోదీని జనమే చంపుతారని మండిపడ్డారు. భవిష్యత్‌లో కరువు దాడులు మాదిరిగా కరెన్సీ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు.

బంగారంపై ఆంక్షలు పెట్టి భవిష్యత్‌లో మహిళల పుస్తేలను కూడా కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుందేమోనని చెప్పారు. దమ్ముంటే 24 గంటల్లో మోదీ క్యాబినేట్ అంతా తమ వద్ద ఉన్న బంగారంతో ఆస్తుల లెక్కలు చెప్పాలని సవాల్ విసిరారు. పాతనోట్ల రద్దుకు, జియో గడువు పొడిగింపునకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మోదీ, వెంకయ్య నాయుడి తాతలు సంపాదించిన సొమ్ము కోసం ప్రజలు క్యూలైన్‌లలో నిలబడటంలేదని నారాయణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement