కష్టాలన్నీ సామాన్యులకే: నారాయణ | cpi narayana comments on demonetisation | Sakshi
Sakshi News home page

కష్టాలన్నీ సామాన్యులకే: నారాయణ

Published Sat, Dec 10 2016 1:50 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

కష్టాలన్నీ సామాన్యులకే: నారాయణ - Sakshi

కష్టాలన్నీ సామాన్యులకే: నారాయణ

విజయవాడ: పెద్ద నోట్ల రద్దు మూలంగా కష్టాలన్నీ సామాన్యులకే వచ్చాయని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు పేరుతో సామాన్యులపై మోదీ దాడి చేశారని, నల్లధనమంతా ఎప్పుడో పక్కదారి పట్టిందని ఆయన విమర్శించారు. 'ఇప్పటికే బ్యాంకుల్లో 12 లక్షల కోట్లు డిపాజిట్లు అయ్యాయి. మరి ఇక బ్లాక్‌ మనీ ఎక్కడుంది' అని నారాయణ ప్రశ్నించారు.

నోట్ల రద్దును ఎందుకు చేశారో మోదీకి కూడా అర్థం కావడం లేదని నారాయణ ఎద్దేవా చేశారు. డిజిటల్‌ లావాదేవీలను కార్పోరేట్ల కోసమే తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement