మోదీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు | narayana sensational comments on pm modi | Sakshi
Sakshi News home page

మోదీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Nov 29 2016 6:29 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

మోదీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు - Sakshi

మోదీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

వరంగల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాకోర్టులో శిక్షార్హుడని, ఆయనను వంద బుల్లెట్లతో కాల్చినా పాపం పోదని సీపీఐ నేత ​కే.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ లాంటి వాళ్లు కూడా తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే..  ప్రధాని మోదీ మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని విమర్శించారు.

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రెండున్నరేళ్లలోనే కార్పొరేట్ కంపెనీలకు రూ.5.80 లక్షల కోట్లును మోదీ ధారాదత్తం చేశారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు బ్లాక్‌మనీపై సర్జికల్ దాడికాదు.. సామాన్య ప్రజలపై దాడి చేయడమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి సెంటిమెంట్‌తో, వెంకయ్యనాయుడు బ్లాక్‌మెయిల్‌తో, ఇద్దరు చంద్రులు మోదీ భజనతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement